టి20 వరల్డ్ కప్.. క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన ఐసీసీ?

praveen
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఈ ఏడాది జరగబోయే పొట్టి ఫార్మాట్ ప్రపంచ కప్ గురించి వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇప్పటికే t20 ప్రపంచ కప్ కు సంబంధించి అటు షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. జూన్ 2వ తేదీ నుంచి కూడా ఈ ప్రపంచకప్ ని ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ప్రపంచకంలో విజేతగా నిలవడానికి ఇప్పటికే అన్ని టీమ్స్ కూడా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయ్ అని చెప్పాలి.

 అయితే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా మరింత నాణ్యమైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ అందించడమే లక్ష్యంగా అటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల కేవలం ఒక కొత్త రూల్ కూడా తీసుకువచ్చింది. ఒక ఓవర్ ముగిసిన తర్వాత నిమిషం వ్యవధి లోనే మరో ఓవర్ ప్రారంభించాలి అనే నిబంధన పెట్టింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఐసీసీ అటు క్రికెట్ అభిమానులు అందరికీ కూడా మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది. జూన్ నెలలో ప్రారంభమై ఇక జూన్ 29 వరకు అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరగబోయే టి20 వరల్డ్ కప్ లో కీలకమైన మ్యాచ్ లకు రిజర్వుడే కేటాయించబోతున్నట్లు ప్రకటించింది ఐసిసి.

 ప్రపంచకప్ ఫైనల్ తో పాటు సెమీఫైనల్ మ్యాచ్లోకి కూడా రిజర్వ్డ్ డే కేటాయించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గ్రూప్ స్టేజ్ సూపర్ 8 దశలో కనీసం 5 ఓవర్లు లేదంటే సెమీ ఫైనల్స్ లో కనీసం 10 ఓవర్ల పాటు సెకండ్ ఇన్నింగ్స్ జరిగితేనే ఇక రిజర్వు డే కేటాయిస్తారట. ఒకవేళ అలా జరగకపోతే.  ఇక మ్యాచ్ ను రద్దు చేస్తారు అన్నది తెలుస్తోంది. అయితే ఇలా రిజర్వ్డ్ డే ఆప్షన్ ఇవ్వడం గురించి తెలిసి క్రికెట్ ప్రేక్షకులు ఆనందంలో మునిగిపోతున్నారు. కాగా జూన్ 5వ తేదీన భారత జట్టు తొలి మ్యాచ్ ఐర్లాండ్తో ఆడబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: