పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. కానీ భారత్ ఎక్కడ మ్యాచ్ లు ఆడనుందంటే?

praveen
వరల్డ్ క్రికెట్లో చిరకాల ప్రత్యర్ధులుగా కొనసాగుతున్న పాకిస్తాన్, ఇండియా మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా ఇక వరల్డ్ క్రికెట్లో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే . ఇక ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఈ దాయాదుల పోరును హై వోల్టేజ్ మ్యాచ్ అని పిలుస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే అన్ని దేశాల క్రికెట్ జట్ల లాగా ఇక ఈ రెండు టీమ్స్ ఒక దేశ పర్యటనకు మరో టీం వెళ్ళదు. కేవలం ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్లలో మాత్రమే ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచులు జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే గత ఏడాది అటు ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు భారత్ కి వచ్చింది.

 కానీ అంతకుముందు అటు పాకిస్తాన్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ సమయంలో మాత్రం అటు భారత జట్టు పాకిస్తాన్ కు వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో భారత్కు సంబంధించిన మ్యాచ్ లు అన్నీ కూడా యూఏఈ వేదికగా ప్రత్యేకమైన వేదికలో నిర్వహించారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక పాకిస్తాన్ వేదికగా 2025 ఛాంపియన్స్ ట్రోపీ జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు పాకిస్తాన్ రావాల్సిందే అంటూ అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కోరుతోంది. కానీ తమ ప్లేయర్లను అటు పాకిస్తాన్ పంపించేందుకు బీసీసీఐ ఎక్కడ కూడా సుముఖత వ్యక్తం చేయట్లేదు అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో కూడా పలు మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా జరిగే పాకిస్తాన్ భారత్ మ్యాచ్ లను యూఏఈ వేదికగా నిర్వహించాలని అటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిలర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక దీనికి బీసీసీఐ కూడా అనుమతి రావాల్సి ఉంది. అయితే ఇందుకు బీసీసీఐ అంగీకరిస్తే ఇరుజట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా పాకిస్తాన్ వేదికగా జరిగే ఛాంపియన్ ట్రోఫీలో ఆడేది లేదని బీసీసీఐ గతంలోనే తేల్చి చెప్పింది  దీంతో ఇక పాకిస్తాన్లో కాకుండా యూఏజీ లో మ్యాచ్లు ఆడాలని భారత్ ని అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విన్నవించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: