ఐపీఎల్ లో అలాంటి ప్లేయర్లపై.. చర్యలు తీసుకోవాల్సిందే?

praveen
భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఐపిఎల్.. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. మార్చి 22వ తేదీ నుంచి కూడా ఈ మెగా టోర్ని మొదలు కాబోతోంది. ఈ క్రమంలోనే ఇక అన్ని టీమ్స్ కూడా ఈ సారి టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక ప్రేక్షకులందరూ కూడా తమ అభిమాన జట్టుకు మద్దతు పలుకుతూనే ఉన్నాయ్. ఇక ఐపీఎల్ లోనీ క్రికెట్ ఎంటర్టైన్మెంట్ను ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతున్నారు అని చెప్పాలి. దీంతో ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు సంబంధించిన హడావిడినే కనిపిస్తూ ఉంది.

 అయితే గత ఏడాది డిసెంబర్లో జరిగిన మినీ వేలం ద్వారా ఎంతో మంది కొత్త ఆటగాళ్లను జట్టులో చేర్చుకున్న ఆయా ఫ్రాంచైజీలు.. ఏకంగా ఆయా ఆటగాళ్లతో జట్టును మరింత పటిష్టంగా మార్చుకోనేందుకు బరిలోకి దిగినందుకు సిద్ధమవుతున్నాయి అని చెప్పాలి. ఇలాంటి సమయంలో కొంతమంది ప్లేయర్ల తీరు మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. సరిగా ఐపీఎల్ ప్రారంభానికి కొన్ని రోజుల సమయం ఉండగా ఇంతలో కొంతమంది ఆటగాళ్లు వ్యక్తిగత కారణాలు అంటూ చెబుతూ చివరికి.. ఐపీఎల్ టోర్నీ మొత్తానికి దూరం అవుతున్నారు. ఏకంగా వేలంలో పాల్గొని కోట్ల రూపాయల ధర పలికిన ఆటగాళ్ళు సైతం ఐపీఎల్ నుంచి తప్పుకుంటూ ఉండటం చర్చనీయాంశంగా మారిపోయింది.

 ఇలా వ్యక్తిగత కారణాలు అంటూ రీజన్ చెప్పి ఐపిఎల్ నుంచి తప్పుకుంటున్న స్టార్ ప్లేయర్స్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయం కాస్త ప్రస్తుతం హార్ట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఐపీఎల్ కు అనూహ్యంగా దూరం అవుతున్న విదేశీ ప్లేయర్లపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐని ఆయన ఫ్రాంచైజీలు కోరినట్లు తెలుస్తుంది. చిన్న చిన్న కారణాలతో ఫారిన్ ఆటగాళ్లు టోర్నినీ వీడుతున్నారు. ఒక్కసారి ఐపీఎల్ లో పేరు రిజిస్టర్ చేసుకొని.. ఏదో ఒక జట్టులోకి ఎంపిక అయితే తప్పకుండా ఆడాల్సిందే. ఐపీఎల్ విషయంలో కమిట్మెంట్తో ఉండాలి. బిసిసిఐ ఈ విషయంపై దృష్టి సారించాలి అంటూ ఐపిఎల్ ఫ్రాంచైజీలు కోరినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటివరకు రూట్, స్టోక్స్, బ్రూక్ లాంటి ప్లేయర్లు వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: