ముంబై టీమ్ ని చూస్తే.. ఏ ట్రోఫీ అయినా దాసోహం అవ్వాల్సిందేనా?

praveen
ముంబై జట్టు అంటేనే ట్రోఫీలు గెలవడానికి కేరాఫ్ అడ్రస్సా. ప్రస్తుతం భారత క్రికెట్లో ఇదే చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ముంబై జట్టు ఏ టోర్నీలో బరిలోకి దిగిన ఛాంపియన్ టీం గానే అవతరిస్తూ ఉంది. ఎక్కువసార్లు టైటిల్ గెలిచిన జట్టుగా రికార్డు కూడా సృష్టిస్తుంది. ఎందుకో ముంబై టీం లో ఉన్నంతమంది టాలెంటెడ్ ప్లేయర్స్ మిగతా టీం లో లేరేమో అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కలిగే విధంగా ఆ జట్టు ప్రస్థానం కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఇక బిసిసిఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ టీం ఛాంపియన్ టీం గా కొనసాగుతుంది.

 ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఈ జట్టు ఎక్కువసార్లు టైటిల్ గెలిచిన టీం గా కొనసాగుతోంది అని చెప్పాలి  ఇక మరోవైపు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కూడా ముంబై ప్రస్థానం ఎంతో విజయవంతంగా సాగుతోంది. ఏకంగా మొదటి సీజన్ లోనే ముంబై టైటిల్ విజేతగా నిలిచింది. ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రెండోసారి టైటిల్ ఎగరేసుకుపోవడం ఖాయం అన్నది తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రతిష్టాత్మకమైన దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో కూడా ఇక ముంబైనీ మించిన మరో ఛాంపియన్ టీం లేదు అన్నది ఇప్పటికే నిరూపితమైంది.

 ఇక ఇటీవలే జరిగిన ఫైనల్ మ్యాచ్లో విజయంతో మరోసారి ఇది అందరికీ అర్థమైంది. విదర్భ జట్టుతో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించిన ముంబై టైటిల్ విజేతగా నిలిచింది అని చెప్పాలి  ఈ క్రమంలోనే విదర్భ జట్టుపై 169 పరుగులు తేడాతో విజయం సాధించి.. 42వ సారి రంజి ట్రోఫీ ని ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ అంటే ట్రోఫీలు గెలవడానికి కేరాఫ్ అడ్రస్ అని.. ఇక ఈ టీం కి మించిన ఛాంపియన్ కి మరొకటి లేదు అంటూ అందరూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే ఇలా రంజి ట్రోఫీ ఫైనల్ గెలిచిన క్రికెట్ జట్టుకు ఏకంగా ఐదు కోట్ల నజరానా ప్రకటించింది ముంబై క్రికెట్ అసోసియేషన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: