ఔట్ అవుతానని.. కుల్దీప్ ముందే చెప్పాడు : అండర్సన్

praveen
నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీగా సాగిన ఇంగ్లాండ్, ఇండియా టెస్ట్ సిరీస్ ఇటీవల ముగిసింది అన్న విషయం తెలిసిందే  ఈ ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో అటు భారత జట్టు ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత నాలుగు మ్యాచ్లలో మాత్రం ఘన విజయాన్ని అందుకుంది టీం ఇండియా. దీంతో 4-1 తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించి సిరీస్ ను కైవసం చేసుకుంది అని చెప్పాలి. ఇక వరుసగా 17వ టెస్టు సిరీస్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.

 అయితే ఈ టెస్ట్ సిరీస్లో ఏకంగా వరల్డ్ క్రికెట్లోనే ఎవరికి సాధ్యం కానీ ఒక అరుదైన రికార్డును సృష్టించి సరికొత్త చరిత్ర సృష్టించాడు ఇంగ్లాండు బౌలర్ జేమ్స్ అండర్సన్. ఏకంగా టెస్ట్ ఫార్మాట్లోనే 700 వికెట్లను అందుకున్నాడు అని చెప్పాలీ  అయితే సాంప్రదాయమైన టెస్ట్ క్రికెట్లో 700 వికెట్ల మైలురాయిని అందుకోవడం కొత్తేమి కాదు  గతంలో ముత్తయ్య మురళీధరన్, షైన్ వార్న్ లాంటి ఆటగాళ్లు ఈ రికార్డులు సాధించారు  కానీ ఈ ఇద్దరు స్పిన్నర్లు కావడం గమనార్హం. ఫేసర్లు ఎవరు కూడా ఇప్పుడు వరకు ఈ రికార్డు సాధించలేదు. కానీ అండర్సన్ ఇలాంటి రికార్డు సాధించి చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. దీంతో అతని ప్రదర్శన పై అందరూ ప్రశంసలు కురిపించారు అని చెప్పాలి.

 అయితే ధర్మశాల వేదికగా జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్లో అటు భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జేమ్స్ అండర్సన్ కి 700వ వికెట్గా మారిపోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇదే విషయం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జేమ్స్ అండర్సన్ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు. ధర్మశాల వేదికగా జరుగుతున్న టెస్టులో బ్యాటింగ్ చేస్తున్న కుల్దీప్.. నేను నీకు 700 వికెట్ కాబోతున్నాను అని ముందుగానే చెప్పాడు  అతను అలా చెప్పిన కొంతసేపటికి నాకు వికెట్ దక్కింది అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో అండర్సన్ గుర్తు చేసుకున్నాడు. కుల్దీప్ కు అవుట్ కావాలని లేదు. కాకపోతే తనకు ముందే అవుట్ అయిపోతానేమో అని అనిపించింది అన్న విషయాన్ని తనతో పంచుకున్నాడు అని జేమ్స్ అండర్సన్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: