బీసీసీఐ దెబ్బకు.. బ్యాటింగ్ విశ్వరూపం చూపించిన అయ్యర్?

praveen
గత కొంతకాలం నుంచి భారత క్రికెట్లో శ్రేయస్ అయ్యర్ ఎంతల హాట్ టాపిక్ గా మారిపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  అయితే అతను దేశవాళి క్రికెట్ కి దూరంగా ఉండడంతో బీసీసీ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా శ్రేయస్ అయ్యర్ ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అందరూ అవాక్కయ్యారు. అయ్యర్ లాంటి ప్లేయర్ పై బిసిసిఐ ఇలాంటి చర్యలు తీసుకోవడం ఏంటి అని షాక్ అయ్యారు.

 అయితే బిసిసిఐ తన పట్ల వ్యవహరించిన తీరుపై.. శ్రేయస్ అయ్యర్ తప్పకుండా తన ఆట తీరుతోనే కౌంటర్ ఇస్తాడని అభిమానులకు కూడా అనుకున్నారు. అయితే శ్రేయస్ అయ్యర్ నిజంగానే ఇది చేసి చూపించాడు. ఏకంగా సెలెక్టర్లపై ఉన్న కోపాన్ని మొత్తం బంతిపై చూపించాడు. దీంతో అద్భుతమైన ఇన్నింగ్స్ తో మరోసారి తన పేరు మారుమోగిపోయేలా చేశాడు ఈ ఆటగాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ముంబై, విదర్భ జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్లుగానే పోరు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ తో అందరీ దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు.

 ప్రస్తుతం విదర్భ  టీం తో జరుగుతున్న రంజి ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు శ్రేయస్ అయ్యర్. దీంతో అతని ఆట తీరుపై విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అదరగొట్టేసాడు. ఏకంగా 111 బంతుల్లోనే 95 పరుగులు చేసి తన బ్యాటింగ్ పవర్ ఏంటి అన్న విషయాన్ని మరోసారి నిరూపించాడు. ఈ క్రమంలోనే ఈ ఇన్నింగ్స్ లో అతను చేసిన పరుగుల్లో దాదాపు 60% కేవలం బౌండరీలు సిక్సర్ల ద్వారానే రావడం గమనార్హం. ఏకంగా అతని ఇన్నింగ్స్ లో పది ఫోర్లు మూడు సిక్సర్లు ఉన్నాయి అని చెప్పాలి. దీంతో శ్రేయస్ ఇన్నింగ్స్ తర్వాత అతను సెలెక్టరుపై కోపాన్ని బంతిపై చూపించాడు అంటూ అందరూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: