షమి రీ ఎంట్రీ అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన జై షా?

praveen
గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా ఎంత అద్భుతమైన ప్రస్తానాన్ని కొనసాగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది అనే ఒక్క నిరాశ తప్ప.. ఇక టోర్నీ మొత్తం టీమిండియా ప్రస్థానం మాత్రం గర్వంగా చెప్పుకునే విధంగానే ఉంది అని చెప్పాలి. అయితే టీమిండియా ప్రస్థానం ఒక ఎత్తు అయితే అటు మహమ్మద్ షమి వరల్డ్ కప్ లో సృష్టించిన సంచలన మరో ఎత్తు. ఇక వరల్డ్ కప్ మధ్యలో అదృష్టవశాత్తు అతను టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు..

 కానీ ఆ తర్వాత మాత్రం అతను టీమిండియాకి లక్కీ ప్లేయర్గా మారిపోయాడు అని చెప్పాలి. అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. అతి తక్కువ సమయంలోనే ఏకంగా వరల్డ్ కప్ టోర్నీలో టాప్ వికెట్ టేకర్ గా కూడా నిలిచాడు అని చెప్పాలి. అయితే వరల్డ్ కప్ సమయంలోనే గాయం బారిన పడినప్పటికీ.. జట్టు కోసం నొప్పిని భరిస్తూనే మ్యాచ్లలో ప్రదర్శన కొనసాగించాడు. ఇక వరల్డ్ కప్ ముగిసిన తర్వాత మాత్రం అతను సర్జరీ చేయించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మహమ్మద్ షమీ రీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అనే విషయంపై అటు అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 అయితే దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్ కు అతను అందుబాటులోకి వస్తాడు అనుకున్నప్పటికీ.. పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించకపోవడంతో అది కుదరలేదు. ఇక కనీసం ఐపీఎల్లో అయినా అతని ఆటను చూడొచ్చు అనుకున్న అభిమానులకు నిరాశ ఎదురయింది. ఎందుకంటే ఐపీఎల్ టోర్ని మొత్తానికి దూరమయ్యాడు. ఇక టి20 వరల్డ్ కప్ కి కూడా అతను అందుబాటులో ఉండడం కష్టమే అని తెలుస్తుంది. ఇక షమి ఏకంగా సెప్టెంబర్ లో జటులోకి రీ ఎంట్రీ ఇవ్వన్నట్లు బీసీసీఐ సెక్రెటరీ జై షా తెలిపారు. ఇండియాలో బంగ్లాదేశ్ లో జరిగే రెండు టెస్టులు మూడు టి20 లకు షమి జట్టులోకి పునరాగమనం చేస్తాడని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: