బజ్ బాల్ అంటే అదే.. కొత్త అర్థం చెప్పిన స్టోక్స్?

praveen
సాధారణంగా టెస్ట్ ఫార్మాట్ అంటే నెమ్మదైన ఆట తీరుకు కేరాఫ్ అడ్రస్. క్రీజులోకి వచ్చిన బ్యాట్స్మెన్ పరుగులు చేయకపోయినా పర్వాలేదు. కానీ ఇక బంతులను డిఫెండ్ చేస్తూ క్రీజులో పాతుకు పోవాల్సి ఉంటుంది. ఇక ఆడపా దడప పరుగులు చేసిన ఇక ఎక్కువసేపు క్రీజులో ఉన్న ఆటగాడిపై ప్రశంసలు కురుస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక టెస్ట్ ఫార్మాట్ మొదలైన వాటి నుంచి కూడా ఇలాంటి ఆట తీరే కొనసాగుతూ వస్తుంది. కానీ సాంప్రదాయమైన క్రికెట్ గా పిలుచుకునే టెస్ట్ ఫార్మాట్ కి సరికొత్త నిర్వచనాన్ని ఇవ్వాలని ప్రయత్నించింది ఇంగ్లాండ్ జట్టు. ఈ క్రమంలోనే నేమ్మదైన ఆట తీరును కాదు ఏకంగా ఎటాకింగ్ గేమ్ తో టెస్ట్ ఫార్మాట్ పై కూడా అందరిలో ఆసక్తిని పెంచింది.

 మేకళ్ళమ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక ఇంగ్లాండ్ ఆట తీరు పూర్తిగా మారిపోయిం.ది క్రికెట్ ప్రపంచానికి బజ్ బాల్ అనే ఒక కొత్త కాన్సెప్టును పరిచయం చేసింది. అప్పటినుంచి టెస్ట్ ఫార్మాట్లో ఎటాకింగ్ గేమ్ ఆడుతూ వస్తుంది. ఇక ఎన్నోసార్లు విఫలమై విమర్శలు కూడా ఎదుర్కొంది. కానీ ఇలాంటి ఆట తీరును మాత్రం మార్చుకోవట్లేదు. అయితే ఇదే బజ్ బాల్  వ్యూహంతో అటు భారత్ లో కూడా టెస్టు సిరీస్ ఆడటానికి వచ్చింది. కానీ ఇక ఇక్కడ ఇంగ్లాండ్ వ్యూహాలు పారలేదు. చివరికి ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ లో నాలుగింటిలో ఓడిపోయిన ఇంగ్లాండ్ సిరీస్ చేజార్చుకుంది.

 అయితే ఇటీవలే ధర్మశాల వేదికగా జరిగిన చివరి టెస్ట్ అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బజ్ బాల్ గురించి మాట్లాడుతూ కొత్త అర్థాన్ని చెప్పుకొచ్చాడు. అందరూ బజ్ బాల్ అంటే ఏంటి అని అడుగుతుంటారు. దానికి అర్థం సరికొత్త ప్లేయర్లను వెలుగులోకి తీసుకురావడమే. ఈ క్రమంలోనే గెలుపు ఓటములు అనేవి సర్వసాధారణం. కొత్త ఆటగాళ్లతో పాటుగా ప్రస్తుతం ఉన్న ప్లేయర్లలో ఉన్న సత్తాను ప్రపంచానికి పరిచయం చేయడం. ప్రేక్షకులను తమ ఆటతీరుతో అలరించటమే బజ్ బాల్ ముఖ్య ఉద్దేశం. బస్ బాల్ అంటే కేవలం వేగంగా ఆడటం మాత్రమే కాదు అంటూ ఇక తమ ఆట తీరుకు సరికొత్త నిర్వచనం చెప్పుకొచ్చాడు స్టోక్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: