సన్రైజర్స్ కొత్త జెర్సీ.. బట్టల షాప్ లో ప్రింటెడ్ టీషర్ట్ లాగా ఉందంటున్న నెటిజెన్స్?

praveen
ఇండియాలో ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2024 కు సంబంధించిన హడావిడి మొదలైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక అన్ని జట్లు కూడా టైటిల్ గెలవడమే లక్ష్యంగా అస్త్ర శాస్త్రాలను సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి. ఇక ఇప్పటికే ఐపీఎల్ పాలకమండలి ఇక ఈ సీజన్ కు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసింది అన్న విషయం తెలిసిందే. మార్చ్ 22వ తేదీ నుంచి కూడా ఈ మెగా టోర్నీ ప్రారంభం కాబోతుంది.

 ఇక ఇప్పటికే అన్ని జట్లు కూడా క్యాంపులను ఏర్పాటు చేయగా ఒక్కో ఆటగాడు.. ఇలా ఆయా జట్ల క్యాంపులో చేరిపోతున్నారు. అయితే ఐపీఎల్ హిస్టరీలో ఒక్కసారి టైటిల్ విజేతగా కొనసాగుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇక ఈసారి టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరులోకి దిగేందుకు సిద్ధమవుతుంది. సన్రైజర్స్ కొత్త కెప్టెన్ గా గత ఏడాది ఆస్ట్రేలియాకు వన్డే వరల్డ్ కప్ టైటిల్ అందించిన ప్యాట్ కమిన్స్ ను నియమించుకుంది. ఇక అతని సారథ్యంలో టైటిల్ గెలుస్తుందని నమ్మకాన్ని పెట్టుకుంది. ఇక జట్టులోకి కొత్త ఆటగాళ్ల రాకతో ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక కొన్ని జట్లు ఐపిఎల్ సీజన్లో కొత్త జెర్సీలతో బరిలోకి దిగడం చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ కోసం సన్రైజర్స్ కొత్త జెర్సీని ప్రకటించింది. ఇటీవలే తమ జెర్సీ ఫోటోను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. అయితే సౌత్ ఆఫ్రికా t20 లీగ్ లో సన్రైజర్స్ ఈస్టర్ కేఫ్ జట్టు ధరించిన జెర్సీనే ఇక ఇప్పుడు ఐపీఎల్ లో కూడా ఖరారు చేసింది. సౌత్ ఆఫ్రికా t20 లీగ్ లో వరుసగా రెండోసారి ఇదే జెర్సీతో సన్రైజర్స్ ట్రోఫీ గెలిచింది. దీంతో సెంటిమెంట్ గా భావించి ఇదే జెర్సీని ఇక ఇప్పుడు ఐపీఎల్ లో కూడా కొనసాగించింది అన్నది తెలుస్తోంది. అక్కడి లీగ్ లోని రిజల్ట్ ఇక్కడ రిపీట్ అవుతుందని నమ్ముతుందట. అయితే ఈ జెర్సీ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇదేదో షాపింగ్ మాల్ లో దొరికే ప్రింటెడ్ టీ షర్ట్ లాగా ఉంది అని కామెంట్లు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: