బజ్ బాల్ సరే.. మరి ఫలితాలేవి.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్?

praveen
సాంప్రదాయమైన క్రికెట్ గా పిలుచుకునే టెస్ట్ ఫార్మాట్లో ఆట తీరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయిన ఆటగాళ్లు సైతం ఇక టెస్ట్ ఫార్మాట్లో ఆచితూచి పరుగులు చేయాల్సి ఉంటుంది. ఏకంగా క్రీజులో పాతుకుపోయి బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ ఉంటారు ఎంతోమంది బ్యాట్స్మెన్లు. ఎన్ని పరుగులు చేశామన్నది కాదు ఎంత సేపు క్రీజులో ఉన్నామన్నది టెస్ట్ ఫార్మాట్లో ఎంతో ముఖ్యం అనడంలో సందేహం లేదు. అలాంటి టెస్ట్ ఫార్మాట్లో సరికొత్త ఆట తీరును పరిచయం చేసింది ఇంగ్లాండ్ జట్టు. ఆ జట్టు కోచ్గా మేకళ్ళమ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బజ్ బాల్ అనేకొత్త ఆట మొదలుపెట్టింది.

 ఈ క్రమంలోనే రెగ్యులర్ గా కొనసాగుతూ వస్తున్న నిమ్మదైన  ఆటతీరును కాకుండా అటాకింగ్ గేమ్ తో ఏకంగా ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచేందుకు నిర్ణయించుకుంది ఇంగ్లాండ్ జట్టు. అయితే కొన్ని టెస్ట్ సిరీస్లలో ఇలాంటి ఆట తీరుతో సక్సెస్ అయింది. కానీ ఎక్కువ శాతం మాత్రం ఇక విమర్శలు ఎదుర్కొంటూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇండియా పర్యటనకు వచ్చి భారత్ తో ఆడుతున్న ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లోను ఇదే ఆట తీరుతో బరిలోకి దిగింది ఇంగ్లాండ్ జట్టు. కానీ ఆ జట్టుకు చివరికి నిరాశే ఎదురయింది. మొదటి మ్యాచ్ లో గెలిచి అదరగొట్టిన ఇంగ్లాండ్.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్లలో ఓడిపోయి సిరీస్ ను చేజార్చుకుంది.

 ఇక ఇప్పుడు ధర్మశాల వేదికగా జరగబోయే చివరి టెస్ట్ మ్యాచ్ లో కూడా గెలుస్తుంది అన్న నమ్మకం కూడా లేకుండా పోయింది అని చెప్పాలి. అయితే ఇంగ్లాండ్ ఆట తీరుపై ఆ జట్టు మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్ ఆటగాళ్ల బజ్ బాల్ ఆట తీరుతో టెస్టులపై మోజును పెంచినప్పటికీ ఫలితాలు లేనప్పుడు ప్రయోజనం ఏంటి అంటూ ప్రశ్నించాడు. క్రికెట్లో చివరికి కనిపించేవి కేవలం గణాంకాలు మాత్రమే. టెస్టు ఛాంపియన్షిప్ టేబుల్ లో ఇంగ్లాండ్ జట్టు కింది నుంచి రెండో స్థానంలో ఉంది. నా దృష్టిలో గణాంకాలే చివరికి కొలమానం. భారత్తో సిరీస్ లో కనీసం చివరి మ్యాచ్ లో అయినా అటు ఇంగ్లాండ్ గెలవాలి అంటూ నాజీర్ హుస్సేన్ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: