రంజీ క్రికెట్ గురించి.. వెంగ్ సర్కార్ కీలక వ్యాఖ్యలు?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్లో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ వ్యవహారమే హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఇద్దరు క్రికెటర్లు గత కొంతకాలం నుంచి క్రికెట్కు దూరంగా ఉన్నారు. గాయం కారణంగా అయ్యర్ మానసిక అలసట కారణంగా ఇషాన్ కిషన్ జట్టుకు దూరమయ్యారు. అయితే అయితే ఇషాన్ కిషన్ ఇప్పుడు వరకు మళ్లీ క్రికెట్ ప్రారంభించలేదు. మరోవైపు గాయం నుంచి కోలుకున్నా అయ్యర్ కూడా క్రికెట్ కు దూరంగానే ఉన్నాడు. ఐపీఎల్ లో ఆడుదాంలే అన్నట్లుగా వారి వ్యవహార శైలి ఉంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే దేశవాలి క్రికెట్ ఆడితేనే మళ్లీ జాతీయ జట్టులో ఛాన్స్ దక్కుతుంది అని బీసీసీఐ పెద్దలు చెప్పిన ఇక ఈ ఇద్దరు ప్లేయర్లు మాత్రం వారి ఆదేశాలను పట్టించుకోలేదు. దీంతో ఇక బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ఇద్దరు ప్లేయర్లను తొలగిస్తూ బోర్డు పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఇది కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. అంతేకాకుండా సెంట్రల్ కాంట్రాక్టు పొందిన ప్రతి ప్లేయర్ కూడా అటు డొమెస్టిక్ క్రికెట్ తో పాటు టెస్ట్ క్రికెట్ కూడా తప్పకుండా ఆడాల్సిందే అంటూ బిసిసిఐ బోర్డు పెద్దలు నొక్కి చెప్పారు. ఇక ఆకలితో ఉన్నవారికే టెస్టుల్లో అవకాశం దక్కుతుందని కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వ్యాఖ్యానించాడు.

 ఈ క్రమంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆకలితో ఉన్నవారికే టెస్ట్ అవకాశాలు వస్తాయని చెప్పిన మాటలను సమర్థించాడు వెంగ్ సర్కార్. రంజీల్లో ఆడటం చాలా ముఖ్యం. దీనివల్ల విదేశాల్లో మంచి ప్రదర్శన చేసేందుకు అవకాశం ఉంటుంది. రంజీ ఫార్మాట్లో ఎవరైనా ఆడను అంటే కొత్తవారికి అవకాశం ఇవ్వాలి. క్రికెట్ కంటే పెద్దవాళ్లు ఎవరూ లేరు అంటూ దిలీప్ వెంగ్ సర్కార్ వ్యాఖ్యానించారు. ఇకపోతే రానున్న రోజుల్లో డొమెస్టిక్ క్రికెట్ ను దూరం పెడుతున్న మరికొంతమంది ఆటగాళ్లపై కూడా బీసీసీఐ  చర్యలు తీసుకున్న ఆశ్చర్యపోనక్కరలేదు అని ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: