విజయనగరం (చీపురుపల్లి): కాపు Vs కాపు.. రసవత్తర పోరులో నెగ్గేదెవరు..?

Divya
•ఇద్దరూ తూర్పు కాపులే..
•సఖ్యత లేకపోవడమే టిడిపికి ఇబ్బందిగా మారిందా
•బొత్స సత్యనారాయణకు కలిసొచ్చే అంశాలు ఇవే

(అమరావతి - చీపురుపల్లి)
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల వేడి రోజు రోజుకూ  పెరిగిపోతోంది. ఈరోజు మనం విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గురించి చర్చించుకుందాం. ఇక్కడ కాపు నేతలిద్దరూ పోటాపోటీగా బరిలోకి దిగుతున్నారు.. రాష్ట్ర మంత్రిగా కొనసాగిన బొత్స సత్యనారాయణ వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతుండగా.. ఈయనకు పోటీగా టిడిపి తరఫున కళా వెంకట్రావు సిద్ధమవుతున్నారు.. ఇద్దరికీ రాజకీయాలలో హై ప్రొఫైల్ ఉన్న విషయం తెలిసిందే.
ముందుగా వైసిపి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న బొత్స సత్యనారాయణ ప్రొఫైల్ విషయానికి వస్తే.. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బీఎ పూర్తి చేశారు. డీసీసీబీ చైర్మన్ గా మొదలైన ఆయన రాజకీయ జీవితం అంచెలంచెలుగా ఎదిగింది. 1999లో కాంగ్రెస్ తరపున బొబ్బిలి ఎంపీగా గెలిచిన ఈయన  ఆ తర్వాత 2004, 2009 ఎన్నికలలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక తర్వాత 2014 ఎన్నికల్లో ఓడిపోయిన 2015లో వైసీపీలో చేరారు. ఇక 2019 ఎన్నికల్లో భాగంగా వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచి , కీలక మంత్రి పదవి చేపట్టారు.
తెలుగుదేశం పార్టీ తరపున చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కిమిడి కళా వెంకట్రావు ప్రొఫైల్ విషయానికి వస్తే.. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతైన బీఏ , బీఎల్ పూర్తి చేశారు.. మరొకవైపు టిడిపి నుంచి ఉణుకూరు ఎమ్మెల్యేగా 1983 , 1985, 1989,  2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అలాగే రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. 2009లో చిరంజీవి స్థాపించిన  ప్రజారాజ్యం నుంచి ఎచ్చెర్ల లో పోటీ చేసే ఓడిపోయిన 2014లో మళ్ళీ టిడిపి తరఫున ఎచ్చెర్ల నుంచి గెలిచారు. ఇక తర్వాత 2019 ఎన్నికలలో పోటీ చేసి ఓటమిని చవిచూశారు కిమిడి కళా వెంకట్రావు.
ఇక వీరిద్దరి గెలపోటముల విషయానికి వస్తే.. విజయనగరం లోక్సభ స్థానమైన చీపురుపల్లి నియోజకవర్గంలో తూర్పు , కాపు ఓటర్లు అధికంగా ఉన్నారు.. చీపురుపల్లి తో పాటు గరివిడి, గుర్ల, మెరకముడిదాం దీని పరిధిలోకి వస్తాయి.. ఇక ఇక్కడ తూర్పు కాపులు 60 శాతం ఉండగా , యాదవ సామాజిక వర్గం 20 శాతం ఓటర్లు, ఇతరులు 20 శాతం ఓటర్లు ఉన్నట్లు సమాచారం. ఇక వీరి గెలుపోటముల విషయానికి వస్తే.. ఇద్దరూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు పైగా ఇద్దరు రాజకీయాలలో ఆరితేరిన వారే.. ఈ నేపథ్యంలో చీపురుపల్లిలో ఎవరి వ్యూహం ఎలా ఉంది అనే విషయానికి వస్తే.. అటు టిడిపి ఇటు వైసిపి నుంచి పోటీ చేస్తున్న ఈ ఇద్దరు నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా కీలక నేతలుగా పేరు సొంతం చేసుకున్నారు.
ఒకవైపు బొత్స సత్యనారాయణకు అనుకూలంగా అనిపిస్తే.. మరొకవైపు కళా వెంకట్రావుకు ప్రతికూలంగా వాతావరణం కనిపిస్తున్నట్లు సమాచారం. కిమిడి నాగార్జునకు సీటు దక్కకపోవడం వల్లే టీడీపీ నేతల్లో అసమ్మతి ఏర్పడింది. ఈ క్రమంలోనే ప్రచారంలో ఇబ్బందులు తరలించడం అటు కిమిడి కళా వెంకట్రావుకు సొంత పార్టీలోనే అనుకూలత లేకపోవడం మైనస్ గా మారింది. మరోవైపు బొత్స సత్యనారాయణ ఇదే ప్రాంతానికి చెందినవారు కావడం ఈయనకు కలిసొచ్చే అంశం అయితే కిమిడి కళా వెంకట్రావు మాత్రం కొత్తగా ఈ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నప్పటికీ.. గతంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రాంతాలలో అభివృద్ధి కనబరిచారు.. ఈ నేపథ్యంలో ఈయనకు ఓటు వేసే అవకాశాలు కూడా ఒకరకంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే స్థానికంగా ఉన్న ముగ్గురు నేతల బలాలు బొత్స సత్యనారాయణకు అండగా ఉన్నాయి. అయితే కిమిడి కళా వెంకట్రావుకు మాత్రం కిమిడి నాగార్జున సపోర్టు లేకపోవడం ఇక్కడ టిడిపికి దెబ్బ కొట్టే అవకాశం ఉంది.. ఇక ఎన్నికలకు మరో 13 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో పోటాపోటీగా అటు బొత్స సత్యనారాయణ ఇటు కళా వెంకట్రావు ప్రచారంలో పాల్గొంటున్నారు.. ఇక చివరిలో ఓటర్లు ఎవరు ఎటువైపు వెళ్తారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: