"నింద" టీజర్ విడుదల తేదీ వచ్చేసింది.. ఈసారైనా వరుణ్ సక్సెస్ అవుతాడా..?

Pulgam Srinivas
హ్యాపీ డేస్ , కొత్త బంగారు లోకం , కుర్రాడు లాంటి విజయవంతమైన సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వరుణ్ సందేశ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో మంచి విజయాలను అందుకున్న ఈయన ఆ తర్వాత వరుస అపజాయలను అందుకుంటూ వచ్చాడు. దానితో ఈయన క్రేజ్ భారీగా తగ్గిపోయింది. అలా సినీ పరిశ్రమలో క్రేజ్ తగ్గడంతో ఆఫర్ లు కూడా తగ్గాయి.
 

ఇకపోతే ఈయన తెలుగు లో ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినటువంటి బిగ్ బాస్ లోకి తన భార్యతో కలిసి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ షో ద్వారా మాత్రం ఈయన మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ షో నుండి బయటికి వచ్చాక ఈయనకు సినిమా అవకాశాలు కూడా కాస్త పెరిగాయి. కొన్ని రోజుల క్రితమే వరుణ్ సందేశ్ "చిత్రం చూడరా" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు.

ఇకపోతే ప్రస్తుతం వరుణ్ సందేశ్ "నింద" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. యదార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందుతున్నట్లు తెలుస్తోంది. కాండ్రకోట మిస్టరీ నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతున్నట్లు సమాచారం. రాజేష్ జగన్నాథం ఈ సినిమాకు దర్శకత్వం వహించడం మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.

ఇక ఈ మూవీ కి ఇతనే కథను కూడా రాసుకున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి మేకర్స్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమా యొక్క టీజర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ యొక్క టీజర్ ను రేపు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vs

సంబంధిత వార్తలు: