గుడిలో ప్రత్యేక పూజలు చేసిన నయనతార దంపతులు.. ఫొటోస్ వైరల్..!

Anilkumar
తమిళ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న నయనతార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటు తమిళంలోనే కాకుండా అటు తెలుగులో కూడా వరుస సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా ఉంది ఈ బ్యూటీ. వరస హిట్ లను తన ఖాతాలో వేసుకుంటూ పోతోంది. ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న అందరి స్టార్ హీరోల సరసన ఆడి పాడింది ఈ ముద్దుగుమ్మ. అలాగే ఇప్పుడున్న స్టార్ హీరోల కంటే ఎక్కువగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోంది ఈ బ్యూటీ. అయితే ఈ ముద్దుగుమ్మ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నాయనతార కి సంబంధించిన

 పలు లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా నయనతార తన భర్తతో కలిసి ఒక గుడిలో ప్రత్యేక పూజలు చేయించింది. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే నయనతార ఇటీవల పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సరోగసి పద్ధతి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయ్యింది .అయితే వీరిద్దరూ సరోగసి పద్ధతి ద్వారా తల్లిదండ్రులు అయ్యారు. కాగా ఇటీవల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది నయనతార. సోషల్ మీడియా ద్వారా తన లేటెస్ట్ లుక్స్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది. గ్లామర్ డోస్ పెంచుతు ఫోటోలను షేర్

 చేసింది.. మొన్నీమధ్య షేర్ చేసిన ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో మనం చూశాం.. ఇప్పుడు పద్దతిగా గుడిలో పూజలు చేయిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..నయనతార సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకొనే పనిలో ఉంది.. తెలుగు సినిమాలను అనౌన్స్ చేసినట్లు లేదు.. ప్రస్తుతం తమిళ సినిమాల్లో బిజీగా ఉంది.. అలాగే ప్రస్తుతం పిల్లలతో గడుపుతుంది.. ఫ్యామిలీ వేకెషన్స్ లో బిజీగా ఉంది.. ఇప్పటికప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తమిళ్ తెలుగులో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ బ్యూటీ ఇటీవల బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్లో జవాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. అలా ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేసే అవకాశాన్ని అందుకుంటుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: