క‌సి + కృషి = నారా లోకేష్‌... !

RAMAKRISHNA S.S.
- బాబు జైళ్లో ఉన్న‌ప్పుడు జాతీయ స్థాయిలో లోకేషోద్య‌మం
- ఓట‌మి నుంచి క‌సి, కృషితో బంప‌ర్ విక్ట‌రీ
- యువ‌గ‌ళం పాద‌యాత్ర‌తో యూత్‌లో తిరుగులేని క్రేజ్‌
( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఒక కృషి+ ఒక ప‌ట్టుద‌ల ఉంటే.. ఏదైనా సాధించ‌వ‌చ్చ‌ని చెబుతుంది.. మాన‌వాభ్యుద‌య చ‌రిత్ర‌. ఈ రెం డుతో పాటు `క‌సి`ని కూడా జోడిస్తే.. వ‌చ్చే ఫ‌లితానికి ప్ర‌తీకే నారా లోకేష్‌. ఎంతో మంది ముఖ్య‌మంత్రుల కుమారులు ఈ దేశంలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. అయితే.. వారిలో చాలా మంది స‌క్సెస్ అయ్యారు. అంతే సంఖ్య‌లో విఫ‌ల‌మైన వారు కూడా ఉన్నారు. కానీ, ఒక విఫ‌లాన్ని త‌ట్టుకుని నిల‌బ‌డిన వారు.. అరుదుగా ఉన్నారు. తెలంగాణ‌లో మాజీ సీఎం కేసీఆర్ త‌న‌యుడు... కేటీఆర్ ఒక‌ర‌కంగా మైన‌స్‌ల‌లో ప‌డిపోయారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు-పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు మ‌ధ్య నాలుగు మాసాల‌కు పైగా స‌మ‌యం ఉన్నా.. శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో పార్టీ విఫ‌ల‌మైన ద‌రిమిలా.. పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు వ‌చ్చేస‌రికి దానిని స‌రిదిద్ద‌లేక పోయారు. ఒక‌వైపు కేసీఆర్ అనారోగ్యంతో ఉన్న నేప‌థ్యంలో పూర్తి బాధ్య‌త‌లు ఆయ‌న తీసుకున్నా.. ఇబ్బంది ప‌డ్డారు. పార్టీని స‌వ్యంగా ముందుకు న‌డిపించ‌లేక పోయారు. ఈ ప‌రిణామం లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పార్టీని నిలువునా ఇబ్బందిపెట్టింది.

అదే ఏపీలో చూసుకుంటే.. నారా లోకేష్‌.. త‌న తండ్రి, ప్ర‌స్తుతం కాబోయే సీఎం నారా చంద్ర‌బాబు ను జైల్లో పెట్టిన‌ప్పుడు కుంగిపోయినా.. అంతే క‌సితో ముందుకు సాగారు.  త‌న కుటుంబానికి, ముఖ్యంగా రాజ‌కీయంగా జ‌రిగిన అన్యాయాన్ని ఆయ‌న జాతీయ స్థాయిలో వినిపించి.. సానుభూతిని పెంచేలా చేశారు. స‌మాజాన్ని క‌దిలించేలా చేశారు. ఎక్క‌డిక‌క్క‌డ అంద‌రినీ కూడ‌గ‌ట్టారు. ఫ‌లితంగా అస‌లు అధికారంలోకి వ‌స్తుందా ?  అన్న పార్టీని దిగ్విజ‌య దారిలో న‌డిపించారు.

ఇక‌, యువ‌గ‌ళం పాద‌యాత్ర విష‌యంలోనూ అడ్డంకులు వ‌చ్చినా ముందుకే సాగారు. ఫ‌లితంగా పార్టీని, వ్య‌క్తిగ‌త తన గ్రాఫ్‌ను కూడా పెంచుకున్నారు. ఈ విష‌యాలు త‌క్కువేమీ కావు. అత్యంత కీల‌క‌మైన స‌మ‌యంలో అధికార పార్టీని గ‌ద్దె దించేందుకు ప్ర‌ధాన ముడిస‌రుకుగా మారాయి. ఒక క‌సి.. దాంతో పాటు చేసిన అవిర‌ళ కృషి.. నారా లోకేష్‌ను అమాంతం పెద్ద నేత‌ను చేశాయ‌న‌డంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: