వైసీపీకి భారీ షాక్..కీలక నేత రాజీనామా ?

Veldandi Saikiran
ఏపీలో జగన్‌ కు పెద్ద దెబ్బే తగిలింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చెందిన వైసీపీకి నెల్లూరు జిల్లాలో మరో షాక్‌ తగిలింది. నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి వైసీపీకి రాజీనామా చేశారు. తనకు టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కారణంగానే మేయర్ పదవి వచ్చిందని.. ఆయన చెబితే పదవికి సైతం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పొట్లూరి స్రవంతి వెల్లడించారు. ఈ మేరకు ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ... నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...వై.సి.పి పార్టీకి రాజీనామా చేస్తున్నానని వెల్లడిం చారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా నాకు  కార్పొరేటర్ టికెట్ ను శ్రీధర్ రెడ్డీ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. అంతేగాక మేయర్ ను చేశారని వెల్లడించారు మేయర్ పొట్లూరి స్రవంతి.  మాలాంటి ఎందరో కార్యకర్తలకు రాజకీయ అవకాశాలు కల్పించారని స్పష్టం చేశారు. రాజకీయాల్లో నాకు ధై ర్యాన్ని ఇచ్చారని పేర్కొన్నారు మేయర్ పొట్లూరి స్రవంతి.

అలాంటి గొప్పనేత శ్రీధర్ రెడ్డి... వై.సి.పి పార్టీని వీడినప్పుడు కూడా ఆయనతోనే ఉంటానని స్పష్టం చేశామని వెల్లడించారు. అప్పట్లో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో వై.సీ.పీ పార్టీలోకి వెళ్ళాల్సి వచ్చిందని గుర్తు చేశారు మేయర్ పొట్లూరి స్రవంతి.  శ్రీధర్ రెడ్డి పై విమర్శలు చేయాలని... అక్కడి నాయకులు మాపై ఒత్తిడి తెచ్చారన్నారు. కానీ శ్రీధర్ రెడ్డి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.
మా తప్పులను శ్రీధర్ రెడ్డీ మన్నించి మమ్ములను అక్కున చేర్చుకోవాలని కోరుకుంటు న్నామన్నారు మేయర్ పొట్లూరి స్రవంతి. నెల్లూరు కార్పొరేషన్ లో ఫోర్జరీ ఆరోపణలపై విచారణ చేయిస్తామని స్పష్టం చేశారు. నా భర్త జయవర్ధన్ కు పాత్ర ఉందని ప్రచారం చేయడం సరికాదని ఆగ్రహించారు. విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: