సమంత 200 కోట్లు ఆఫర్ ఇచ్చిన టాలీవుడ్ హీరో ?

Veldandi Saikiran
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో పాపులర్ అయిన హీరోయిన్లలో సమంత ఒకరు. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ సమంత... ఆ సినిమా సమయంలోనే అక్కినేని నాగచైతన్య తో ప్రేమలో పడింది. ఇక ఏం మాయ చేసావే సినిమా సక్సెస్ కావడం... ఆ తర్వాత హీరోయిన్ సమంత అలాగే అక్కినేని నాగచైతన్య ప్రేమాయణం ముందటికి సాగడం.. చక చకా జరిగిపోయాయి.
 దాదాపు 7 నుంచి 8 సంవత్సరాల పాటు హీరోయిన్ సమంత అలాగే అక్కినేని నాగచైతన్య ప్రేమించుకున్నారు. అయితే ఏడు సంవత్సరాలు సాగదీసిన తర్వాత అక్కినేని నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జునకు అసలు విషయం చెప్పేశారు. దీంతో వీళ్ళ వివాహం దగ్గరుండి ఇరు కుటుంబాలు చేసేసాయి. అక్కినేని నాగచైతన్య భార్యగా సమంతకు అవకాశం వచ్చిన తర్వాత... టాలీవుడ్ ఇండస్ట్రీలో మరింత క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ.
 వరుసగా సినిమాలు చేసుకుంటూ టాప్ మోస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచింది. తన కాళ్లపై నిలబడి... సక్సెస్ అయింది. ఈ తరుణంలోనే అక్కినేని నాగచైతన్య అలాగే సమంతకు గొడవలు ప్రారంభమయ్యాయి. ఆ గొడవలు కాస్త విడాకుల వరకు వెళ్లాయి. 2017 సంవత్సరంలో అక్కినేని నాగచైతన్య అలాగే సమంత పెళ్లి జరగగా.... 2021 సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు.
 ఇక విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరించారు. తాజాగా శోభిత ధూళిపాళ్లను అక్కినేని నాగచైతన్య రెండవ పెళ్లి చేసుకున్నాడు. సమంత మాత్రం ఒంటరిగానే జీవిస్తోంది. అయితే తాజాగా సమంత గురించి బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు సంచలన వ్యాఖ్యలు చేశాడు. విడాకులు అయిన తర్వాత సమంతకు రెండు వందల కోట్లు ఇస్తానని నాగచైతన్య ఆఫర్ చేశారట. కానీ ఆ డబ్బులను సమంత తీసుకోలేదని సమాచారం. ఇదే విషయాన్ని ఉమైర్ సందు తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: