"సంక్రాంతికి వస్తున్నాం"కి అదిరిపోయే రెస్పాన్స్.. చరణ్.. బాలయ్యకు దమ్కి ఇచ్చేలా ఉందే..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభం నుండి మంచి మంచి కథలను ఎంచుకుంటూ , ఎన్నో విజయాలను అందుకుంటు ఇప్పటికి కూడా తెలుగులో మంచి గుర్తింపు కలిగిన నటుడుగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే వెంకటేష్ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా సైంధవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా నటించగా ... స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేదు.

ఇకపోతే ప్రస్తుతం వెంకటేష్ "సంక్రాంతికి వస్తున్నాం" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ కి బీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమాకు బుక్ మై షో ఆప్ లో ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు బుక్ మై షో ఆప్ లో 150 కే ఇంట్రెస్ట్ లు లభించాయి.

ఈ సంవత్సరం సంక్రాంతి పండక్కి రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ , బాలయ్య హీరోగా రూపొందిన డాకు మహరాజ్ సినిమాలు విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా పెద్దగా పోటీ ఇవ్వదు అని చాలా మంది అనుకున్నారు. ఇక బుక్ మై షో లో ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ను బట్టి చూస్తే ఈ మూవీ చరణ్ , బాలయ్య సినిమాలకు గట్టి పోటీ ఇచ్చే విధంగా ఉంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: