ఒక్క మూవీకి రూ.600 కోట్లు అందుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?
2013లో వచ్చినటువంటి సైన్స్ ఫిక్షన్ మూవీ గ్రావిటీ.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో రికార్డును కూడా తిరగరాసింది. ఒక స్పేస్ స్టేషన్లో రిపేరు చేసే క్రమంలో గ్రహ శకలాలు అందులో ఆస్ట్రోనాట్లను ఎలా చెల్లాచెదురు చేస్తాయనే కథాంశంతో ఈ సినిమా స్టోరీని తీశారు. ఇందులో సాండ్రా బుల్లాక్ , జార్జ్ క్లూని నటించడం జరిగింది. జార్జ్ కూలి అనే యాక్టర్ హాలీవుడ్ లోనే ఒక టాప్ యాక్టర్ ఈ సినిమా కోసం అతని రెమ్యూనరేషన్ కంటే రెండింతల సైతం హీరోయిన్ సాండ్రా తీసుకోవడం జరిగిందట.
మొదట్లో ఈమెకు 20 డాలర్లకు ఒప్పుకోగా అది కాకుండా ఈ సినిమా వచ్చిన లాభాలను 15% వాటా ఒప్పందం కూడా కుదుర్చుకున్నదట. అలా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 730 మిలియన్ డాలర్లకు ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టిందట. దీంతో ఈమె వాటా కింద 50 మిలియన్ డాలర్లు కూడా దక్కాయి అంటే మొత్తం మీద 70 మిలియన్ డాలర్లు సైతం ఇమే సొంతం చేసుకున్నది.. 2013లో డాలర్ విలువ ప్రకారం చూసుకుంటే 395 కోట్లు అవుతుంది అయితే ప్రస్తుతం ఉన్న తాజా విలువ చూసుకుంటే రూ .600 కోట్లు అవుతుందట. కానీ హీరోగా నటించిన జార్జ్ కు ఓన్లీ మాత్రం కేవలం 35 మిలియన్ డాలర్లు మాత్రమే తీసుకున్నారట. అందుకే ఈమె ప్రపంచంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్గా నిలిచింది.