గేమ్ ఛేంజర్: అబ్బాయి కోసం.. చిరు, బాబాయ్ భారీ ప్లాన్..?
ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో.... పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు రామ్ చరణ్. అయితే ఇప్పుడు ఆ సినిమా తర్వాత గేమ్ చేంజర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు మెగా పవర్ రామ్ చరణ్. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా చేస్తే అతని సరసన కియారా అద్వానీ.. స్టెప్పులు వేయనుంది. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు... సంగీత స్వరాలు అందిస్తున్నారు.
దాదాపు 450 కోట్లతో వస్తున్నా ఈ సినిమాకు దిల్ రాజు అలాగే ఆదిత్య రామ్ ప్రొడ్యూసర్లుగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఇలాంటి నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేశారు రామ్ చరణ్. విదేశాలకు వెళ్లి మరి ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ సినిమాను సక్సెస్ చేసుకునేందుకు మెగాస్టార్ చిరంజీవితో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇందులో భాగంగానే డిసెంబర్ 27వ తేదీన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారట. అదికూడా తెలంగాణలో ఒకటి అలాగే ఆంధ్రప్రదేశ్లో మరొక ట్రయిలర్ రిలీజ్ చేయనున్నారట. తెలంగాణ రాష్ట్రంలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దీనికోసం యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో పర్మిషన్ కూడా తీసుకున్నారట. ఏపీలో పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఓ ఈవెంట్ నిర్వహించి.... ఆయన చేతుల మీదుగా కూడా ట్రైలర్ రిలీజ్ కాబోతుందట. దీంతో సినిమాకు మంచి... ప్రమోషన్ జరుగుతుందని.. అనుకుంటున్నట్లు.. సమాచారం.