హమ్మయ్య.. ఎట్టకేలకు విడాకులపై ఐశ్వర్యరాయ్ క్లారిటీ..!

Divya
హీరోయిన్ ఐశ్వర్యరాయ్ ఇండియన్ సినీ పరిశ్రమలోనే ఒక బ్రాండ్ గా పేరుపొందింది.ఈమె అందం, అభినయం అంతా కూడా కెరియర్లో ప్రత్యేకంగా ఒక స్థాయికి తీసుకువెళ్లిందని చెప్పవచ్చు.. 1994లో విశ్వసుందరిగా ఎంపికైన ఈమె తన అందంతో ప్రపంచాన్ని సైతం మంత్రముగ్ధుల్ని చేసిందని చెప్పవచ్చు. ఐశ్వర్యరాయ్ విజయమే భారతీయ మహిళలకు సైతం ఒక స్ఫూర్తిగా నిలిచింది. ఐశ్వర్యారాయ్ తమిళ్ ,హిందీ ,తెలుగు చిత్రాలలో కూడా నటించింది. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ను ప్రేమించి మరి వివాహం చేసుకున్నది ఐశ్వర్యరాయ్.

ఇక ఈ జంటకు 2007లో వివాహం కాక వీరికి ఆరాధ్య అనే పాప జన్మించింది . వీరికి వివాహమై ఇప్పటికి పదహారేళ్లు అవుతూ ఉన్న వీరి కాపురం కూడా సజావుగానే సాగుతోంది. కానీ ఇటీవలే గత కొంతకాలంగా ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పలు రకాల రూమర్స్ అభిమానులను కలవర పెట్టేలా చేశాయి.. అయితే ఇటీవలే అన్నిటికీ సైతం చెక్ పెట్టే విధంగా ఐశ్వర్యరాయ్, అభిషేక్  కలిసి చేయి పట్టుకొని మరి ఒక ఈవెంట్ కి రావడం జరిగింది. దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

గతంలో కూడా అభిషేక బచ్చన్ తన వైవాహిక జీవితంలోకి ఐశ్వర్యరాయ్ రావడం వల్ల తన కెరియర్ మారిపోయిందని తెలిపారు. ధీరుభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవంలో చాలా మంది బాలీవుడ్ సెలబ్రెటీలు పాల్గొన్నారు .అక్కడికి ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ జంటగా రావడంతో పాటుగా ఈ దంపతులు ఇద్దరు కూడా చాలా హ్యాపీగా నవ్వుతూ ఇక్కడ కనిపించారు తమ కుమార్తె ఆరాధ్యను కూడా ఇదే స్కూల్లో చదివిస్తోంది ఈ జంట. మొత్తానికి అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ ఇలా కలిసి దర్శనం ఇవ్వడంతో ఇక మీద రూమర్లకు స్థానం కల్పించకుండా చెక్ పెట్టారని అభిమానులు ధీమాతో తెలియజేస్తున్నారు. మరి ఇక మీదనైనా ఇలాంటి రూమర్స్ ఆగిపోతాయేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: