పిఠాపురం: బయటపడ్డ జనసేన టిడిపి మధ్య విభేదాలు..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజవర్గం గత కొన్ని నెలలుగా హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. ముఖ్యంగా టిడిపి జనసేన పార్టీల మధ్య ఎలక్షన్ ముందు వరకు ఒప్పందం ఉన్నప్పటికీ ఆ తర్వాత ఫలితాలు అనంతరం ఇరువురు పార్టీల మధ్య విభేదాలు బయటకు పడుతూనే ఉన్నాయి. ఇటీవలే సార్వత్రిక ఎన్నికలలో టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేశారు. దీంతో కూటమి కూడా ఘనవిజయాన్ని అందుకుంది ఇదంతా కూడా కేవలం మూన్నాళ్ళ ముచ్చట అన్నట్టుగా కనిపిస్తోంది.

ప్రస్తుతం టిడిపి, జనసేన మధ్య ఆదిపత్య పోరు ఎక్కువగా నడుస్తోందట. గొల్లప్రోలు మండలం తాటిపర్తి లో ఇరువురు వర్గాల మధ్య జరుగుతున్న ఆందోళన వల్ల అక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అపర్ణ దేవీ ఆలయ బాధ్యతల కోసం టిడిపి జనసేన నేతలు ఇద్దరు కూడా కొట్లాడుతున్నారట.. అంతేకాకుండా పిఠాపురం ఎమ్మెల్యేగా ఎవరు ఉంటే వారే ఆలయాన్ని చేపట్టాలంటే కార్యకర్తలు పట్టుబడుతున్నారు. అంతేకాకుండా మరొకవైపు టిడిపి నేత వర్మ పైన జనసేన కార్యకర్తలు కూడా దాడి చేయడం ఒక సంచలనంగా మారిపోయింది. ముఖ్యంగా వైసిపి లో పనిచేసిన వారిని ఎవరు కూడా పార్టీలోకి ఆహ్వానించవద్దంటూ జారీ చేసిన వర్మి గొల్లప్రోలు మండలం నుంచి వైసీపీ సర్పంచులు టిడిపిలోకి తీసుకునేందుకు ప్రయత్నించిన సమయంలోనే జనసేన నాయకులు దాడి చేశారని సమాచారం.

పిఠాపురంలో పాదగయ ఆలయానికి దగ్గరలో ఉన్న జనసేన ఫ్లెక్సీలు సైతం గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు.. పిఠాపురంలో జరుగుతున్న ఈ పరిణామాల పైన నాగబాబు కూడా స్పందిస్తూ జనసేన కార్యకర్తలు సమయం పాటించాలంటూ వేడుకుంటున్నారు. పిఠాపురంలో ఎవరు తప్పు చేసినా కూడా ఉపేక్షించేది లేదంటూ కూడా వెల్లడించారు. అయితే ఒకప్పుడు ఎంతో ప్రశాంతంగా పేరు పొందిన ఈ ఊరు నేరు దాడులు ఘర్షణలతో మునిగి తేలుతోంది. దీంతో పిఠాపురంలో జనసేన టిడిపి బీటలు పారేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: