టీడీపీలో ఓ ఎన్టీఆర్‌, ఓ బాబు... ఇప్పుడు ఓ లోకేష్ శకం స్టార్ట్‌

RAMAKRISHNA S.S.
- నాలుగేళ్ల త‌ర్వాత టీడీపీకి క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ లోకేషే
- 2029 ఎన్నిక‌ల‌కు పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు...?
( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ )
ప్ర‌స్తుతం ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌నుంది. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాట‌లో న‌డిపించే బృహ‌త్త‌ర బాధ్య‌త‌ను ఆయ‌న భుజాల‌కు ఎత్తుకున్నారు. ఆర్థికంగానే కాకుండా.. అభివృద్ధి ప‌రంగా కూడా రాష్ట్రాన్నిముందుకు న‌డిపించ‌నున్నారు. ఇవి పైకిక‌నిపిస్తున్న విష‌యాలు.  అయితే.. మ‌రింత లోతుల్లోకి వెళ్తే.. పార్టీ ప‌రంగా వ‌చ్చే నాలుగు సంవ‌త్స‌రాలు కూడా.. అత్యంత కీల‌కం. ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబు కంటే కూడా.. నారా లోకేష్ ముఖ్య‌మనే చెప్పాలి.

పార్టీ బాధ్య‌త‌లు మ‌రో ఐదేళ్ల త‌ర్వాత అయినా.. నారా లోకేష్‌కు ద‌ఖ‌లు ప‌డ‌నున్నాయి. ఇటు పాల‌న‌లో ఆయ‌న భాగ‌స్వామ్యం ఉంటుంది. ఈ విష‌యం కాద‌నే ప్ర‌సక్తి లేదు. మంత్రిగా వ‌స్తారు. ఉంటారు. కానీ, ప్ర‌భుత్వ పాల‌న కంటే కూడా.. ఇప్పుడు వ‌చ్చే నాలుగేళ్ల స‌మ‌యం అత్యంత కీల‌క బాధ్య‌త‌ల్లోకి ఆయ‌న వెళ్లాల్సి ఉంటుంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. ఎన్డీయే ఇలానే ఉంటే మంచిదే.. లేక‌పోతే.. పార్టీ ప‌రంగా.. నారా లోకేష్ అత్యంత ముఖ్య నాయ‌కుడిగా ఎదగాల్సిన అవ‌స‌రం ఉంటుంది.

రాష్ట్ర నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు చేప‌ట్టే స‌మ‌యం మ‌రో నాలుగు సంవత్స‌రాల్లోనే క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యం లో నారా లోకేష్ మ‌రింత కీల‌కంగా వ్య‌వ‌హరించాల్సి ఉంటుంద‌నేది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌. మ‌రో మాట చెప్పాలంటే.. నారా లోకేష్‌.. పార్టీ క‌ర్త‌, క‌ర్మ, క్రియ‌గా మారనున్నార‌నేది కీల‌కం. నిర్ణ‌యాలు.. చ‌ర్య‌ల విష‌యంలో నారా లోకేష్ పాత్ర మ‌రింత పెర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఇప్ప‌టి నుంచి రాటు దేలాల్సిన అవ‌స‌రం ఉంది. ఆ దిశ‌గా ఇప్ప‌టికే అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే.

ఇక‌, ముందు కూడా..మ‌రింత‌గా నారా లోకేష్ పాత్ర పెర‌గ‌నుంది. దీంతో వ‌చ్చే నాలుగేళ్ల కాలంలో ఆయ‌న ప్ర‌జ‌లతోను.. నాయ‌కులతోనూ.. వ్య‌వ‌హ‌రించే తీరును ప్ర‌తి ఒక్కరూ గ‌మ‌నిస్తారు. దీనిని బ‌ట్టే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి నారా లోకేష్‌కు మార్కులు పెరుగుతాయి. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగింది.. జ‌రుగుతున్న‌ది ప‌క్క‌న పెడితే.. రాబోయే నాలుగు సంవ‌త్స‌రాలు పార్టీలో ఆయ‌న పాత్ర ఏంటనేది మ‌రీ ముఖ్యంగా మార‌నుంద‌నడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: