షాక్: అలాంటి అనారోగ్య సమస్యతో స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

Divya
టాలీవుడ్ లో ఎన్నో వైవిద్యమైన చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ ఆదాశర్మ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలో చిత్రాలలో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా లేడి ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంటోంది. అంతేకాకుండా ఎన్నో రకాల వివాదాలు కూడా చిక్కుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.

 హీరోయిన్ ఆదాశర్మ కి అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టిందట. ఒక అరుదైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లుగా తెలియజేస్తోంది.ఇందుకు గల కారణాలు ఏమిటంటే తను సినిమాల కోసం చేసినటువంటి డైట్లే అన్నట్లుగా తెలియజేస్తోంది. ది కేరళ స్టోరీ సినిమాతో మంచి క్రేజ్ అందుకుంది ఆదాశర్మ. ప్రస్తుతం అన్ని భాషలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నది.  ఈమె క్రిమినల్ ఆర్ డెవిల్ అనే చిత్రంలో నటిస్తోంది.

ఆదాశర్మ మాట్లాడుతూ.. ది కేరళ స్టోరీ సినిమాలో నటిస్తున్నప్పుడు కాలేజీ అమ్మాయిల కనిపించడానికి చాలా బరువు తగ్గానని ఆ తర్వాత బస్టర్ ది నక్సల్స్ మూవీలో నటించేటప్పుడు మరింత బరువు పెరగాల్సి వచ్చింది.. ఆ చిత్రంలో బరువైన గన్నులు మోయాలి కాబట్టి చాలా లావుగా కనిపించాలని బలంగా ఉండాలని డైలి ఒక డజన్ అరటి పనులు తినేదాన్ని అలాగే డ్రై ఫ్రూట్స్, ఫ్లాకి సీడ్స్ ఇతరత్రా వాటిని తింటూ షూటింగ్స్ కి తీసుకు వెళ్లే దారిని అంటూ తెలుపుతోంది.

ఇలాంటి సమయంలో ఒక్కసారిగా బరువు తగ్గడం మళ్ళీ పెరగడం వల్ల తన శరీరం రకరకాలుగా మార్పులు చోటు చేసుకున్నాయని చాలా ఒత్తిడికి గురయ్యానని దీనివల్ల అనారోగ్యానికి గురయ్యానంటూ తెలుపుతోంది. తనకు ఇప్పుడు ఎండ్రోమెట్రియోసిన్ వ్యాధి వచ్చినట్లుగా తెలియజేస్తోంది..అంటే పీరియడ్స్ నాన్ స్టాప్ గా కొనసాగుతూనే ఉంటుందట. ఈ జబ్బు కారణంగానే తాను దాదాపుగా 48 రోజులపాటు ఆగకుండా వచ్చే పీరియడ్స్ తో చాలా ఇబ్బంది పడ్డానంటూ వెల్లడించింది. దీంతో ఆదాశర్మ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఈమెను సినిమాల కంటే ఆరోగ్యమే ముఖ్యము త్వరగా కోలుకొనీ.. ట్రీట్మెంట్ తీసుకో అంటూ సలహా ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: