లోకేష్ ఆట మొద‌లైందా... ఎవ్వరూ ఊహించ‌ని గేమ్ ఇది..!

RAMAKRISHNA S.S.
- ఇండియ‌న్ పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ హీరోగా లోకేష్‌
- వ‌చ్చే 30 ఏళ్ల‌లో దేశ రాజ‌కీయాల్లో కీ రోల్‌
( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )
టీడీపీ యువ నాయ‌కుడు, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. నారా లోకేష్‌దే ఫ్యూచ‌ర్‌. ఈ విష‌యంలో సం దేహం లేదు. చంద్ర‌బాబు కూడా.. పార్టీ ప‌గ్గాల‌ను త్వ‌ర‌లోనే ఆయ‌న‌కు అందించాల‌ని నిర్ణ‌యించకున్నా రు. అయితే.. దీనికి కొంత మేర‌కు స‌మ‌యం ఉండొచ్చు. కానీ, వ‌చ్చే ఐదేళ్ల‌లో ఏదో ఒక రోజు ఆయ‌న‌కు పార్టీ అయితే..చేతికి అందుతుంది. ఈ నేప‌థ్యంలో రానున్న 30 ఏళ్ల‌పాటు పార్టీని తీర్చిదిద్దేందుకు నారా లోకేష్ ఇప్ప‌టి నుంచి రెడీ కావాల్సిన అవ‌స‌రం ఉంది.

ఈ విష‌యంలో నారా లోకేష్‌కు ఉన్న స‌మ‌స్య‌లు రెండు. ఒక‌టి సీనియ‌ర్ల‌ను మ‌రింత ఎక్కువ‌గా త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేయాలి. ఇదే స‌మ‌యంలో యువ నాయ‌క‌త్వానికి.. సీనియ‌ర్ల‌కు మ‌ధ్య ఉన్న తేడా ను త‌గ్గించే ప్ర‌య‌త్నం చేయాలి. ఈ రెండు చేయ‌డం ద్వారా.. స‌మ‌పాళ్ల‌లో త‌న నాయ‌క‌త్వాన్ని ముందు కు తీసుకువెళ్లేందుకు నారా లోకేష్‌కు అవ‌కాశం ఉంటుంది. ఇదే స‌మ‌యంలో మ‌రింత వ‌న్నె తేరాల్సిన విధానాలు కూడా.. క‌నిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం నారా లోకేష్ చుట్టూ ఓ కోట‌రీ ఉంద‌నేది వాస్త‌వం. ఈ కోట‌రిలో ఉన్న‌వారికి ఆయ‌న అధిక ప్రాధాన్యం ఇస్తున్నార‌న్న వాద‌న కూడా.. పార్టీలో ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది. గ‌తంలో చంద్ర‌బాబుకు  కూడాఇలానే కొంద‌రు కోట‌రీగా ఏర్ప‌డ్డారు. కుటుంబాలు, నాయ‌కులు కూడా.. ఆయ‌న‌పై ఒత్తిడి తెచ్చిన సంద‌ర్భాలు ఉన్నాయి. వీటిని ఛేదించుకుని బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు చంద్ర‌బాబు కు చాలానే స‌మ‌యం ప‌ట్టింది. దీనిని గ్ర‌హించిన ఆయ‌న కోట‌రీని దాదాపు త‌గ్గించుకున్నారు.

రాబోయే రోజుల్లో నారా లోకేష్ ఈ కోట‌రీకి , కోట‌రీ రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. దీనిని ఆయ‌న సాధిస్తే.. ఫ్యూచ‌ర్‌లో ఇబ్బందులు త‌గ్గి.. క్షేత్ర‌స్థాయిలో నేత‌ల‌కు ఆయ‌న నాయ‌కుడిగా బ‌ల‌మైన ముద్ర వేయ‌గ‌లుగారు. ఏ పార్టీలో అయినా..నాయ‌కుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం ఈజీనే. కానీ, కోట‌రిని దాటుకోవ‌డ‌మే క‌ష్టం. ఇది సాధించారు కాబ‌ట్టి.. యూపీలో అఖిలేష్ యాద‌వ్ స‌క్సెస్ అయ్యారు. తెలంగాణ‌లో కోట‌రీని పెంచి పోషించుకున్నారు కాబ‌ట్టి.. కేటీఆర్ ఫెయిల్ అయ్యార‌నే వాద‌న ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: