లోకేష్: పడ్డాడు కానీ పడిపోలేదు.. విమర్శల నుంచి రాటు తేలిన రత్నం..!

Divya
•ఎన్నో విమర్శలు.. గట్టిగా సమాధానం చెప్పిన లోకేష్..
•పడ్డాడే కానీ పడిపోలేదు కదా..
•నెక్స్ట్ సీఎం లోకేష్
" పడ్డవాడు చెడ్డవాడు కాదు " అని పెద్దలు ఊరకనే చెప్పలేదు.. ఎవరైతే విమర్శలను , అవమానాలను ఎదుర్కొంటారో దానికి దీటుగా రెట్టింపు వేగంతో చివరికి విజయం సాధిస్తారు అనడంలో మనకు తారసపడుతున్న కొందరు నేతలే ఇందుకు నిదర్శనం అని చెప్పొచ్చు. గతంలో రాజకీయాలలోకి అడుగుపెట్టిన లోకేష్.. ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు.. ముఖ్యంగా 2019లో తమ పార్టీ ఓడిపోయినప్పుడు.. తాను కూడా మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఎలాగైనా సరే అక్కడే తనను తాను నిరూపించుకోవాలని పాదయాత్ర చేపట్టారు. ప్రజలతో మమేకం అవుతూ ప్రజలతో అప్పుడప్పుడు మాట్లాడే మాటల వల్ల ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నారు పప్పు అన్నారు.. సుద్ద ముద్ద అన్నారు.. అయినా సరే వేటినీ ఆయన పట్టించుకోలేదు.

అయితే ఈయన విమర్శలు పొందడానికి ప్రధాన కారణం 2014లో చంద్రబాబు నాయుడు సీఎంగా అధికారంలోకి వచ్చినప్పుడు.. చంద్రబాబు కేబినెట్ లో మంత్రి అయ్యారు నారా లోకేష్.. కనీసం ఎమ్మెల్యేగా గెలవకుండా మంత్రి అయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. ఆ సమయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు.. తండ్రి హయాంలో ఎమ్మెల్యేగా గెలవకుండానే ఎలా మంత్రి అయ్యారు అంటూ చాలామంది కామెంట్లు చేశారు. ఇక మంగళగిరికి వచ్చి అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు.. అయితే అక్కడ కూడా ఓడిపోయారు.. ఈ సమయంలో చాలామంది రాజకీయ దృక్కోణంలో ఎన్నో విమర్శలు కూడా చేశారు. అసలు ఎక్కడో అమ్మాయిలతో రాసలీలలు చేస్తూ ఉండేవాడికి రాజకీయాలు అవసరమా అంటూ కూడా నానారకాలుగా ఆయనను విమర్శించారు.. కానీ వేటిని పట్టించుకోకుండా రాజకీయ గెలుపే దిశగా ప్రజలతో మమేకం అవుతూ తనను తాను నిరూపించుకున్నారు.. ఎంతలా అంటే ఈసారి ఎన్నికలలో మంగళగిరి నుంచే పోటీ చేసి ఏకంగా 92 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది రికార్డ్ సృష్టించారు నారా లోకేష్..

అప్పుడు ఓడిపోయి కిందపడ్డాడు. కానీ పూర్తిగా పడిపోలేదు.. అందుకే లేచి నిలబడి మళ్లీ ఉన్నత స్థాయికి చేరుకున్నారు. నేడు ఎంతోమంది విమర్శలకు గట్టి సమాధానం చెప్పారు. మొత్తానికైతే నారా చంద్రబాబు వారసుడిగా తదుపరి సీఎం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: