యశ్ కొత్త సినిమాలో మరో ఇద్దరు స్టార్ హీరోయిన్స్.. ఎవరంటే..!?

Anilkumar
కే జి ఎఫ్ సినిమాతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యష్ ఆ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్ని సినిమా ఆఫర్లు వచ్చినా కూడా ఏ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వని యశ్ ఒకే ఒక్క దర్శకురాలికి అవకాశం ఇచ్చాడు. ఇక అదే ఎవరో కాదు గీత మోహన్ దాస్. అయితే ఈమె ఒక మలయాళ లేడీ దర్శకురాలు. ఇదిలా ఉంటే తాజాగా ఇప్పుడు యష్ టాక్సిక్ అనే ఒక సినిమాను అనౌన్స్ చేశాడు. ఇక ఈ సినిమా టైటిల్ చూస్తుంటే సినిమా ఫుల్ యాక్షన్ కంటెంట్ తో ఉంటుందేమో అని అనిపిస్తుంది. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవేంటంటే టైటిల్ చూస్తుంటే ఫుల్ యాక్షన్ కంటెంట్ తో సినిమా ఉంటుందేమో

 అనుకుంటున్నాము. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమాకి సంబంధించిన పుకార్లు వింటుంటే మాత్రం అలా కాదు అని అనిపిస్తుంది. అది ఏంటంటే ఈ సినిమాలోని ట్విస్టులు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని అంటున్నారు. దానికోసం దర్శకురాలు సైతం భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాలోకి మరో ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఆడ్ అయినట్లుగా సమాచారం వినబడుతుంది. ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ హీరోయిన్గా నటిస్తోంది అని గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ పాత్ర కోసం లేడీస్ సూపర్ స్టార్ నయనతారను తీసుకున్నట్లుగా వార్తలు

 వినబడుతున్నాయి. కానీ ఈ విషయంపై మాత్రం ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. అయితే ఈ హీరోయిన్ తో పాటు మరొక హీరోయిన్ కూడా ఇందులో ఉన్నట్లుగా తెలుస్తోంది ఆమె హ్యూమ ఖురేషి. 'కేజీయఫ్‌' విజయాల తర్వాత యశ్‌ నటిస్తున్న చిత్రం 'టాక్సిక్‌'. గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో హ్యామా కీలక పాత్రలో కనిపిస్తుందట. అందాల ప్రదర్శన కాకుండా ఆమె యుద్ధ కళల ప్రదర్శన ఈ సినిమాలో ఉంటుంది అని చెబుతన్నారు. ఈ సినిమాను పాన్‌ ఇండియా వెర్షన్‌, ఇంటర్నేషనల్‌ వెర్షన్‌.. ఇలా రెండు రూపాల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న సినిమా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: