Nbk -109: అదిరిపోయే అప్డేట్.. నెక్స్ట్ లెవెల్ లో టీజర్..!

Divya
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పటికే వరుసగా హ్యాట్రిక్ విజయాలను సాధించిన బాలయ్య డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో 109వ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చిన బాలయ్య మళ్ళీ తిరిగి సెట్లో అడుగుపెట్టబోతున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈరోజు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అదిరిపోయే టీజర్ ని చిత్ర బృందం విడుదల చేసింది.

టీజర్ విషయానికి వస్తే దేవుడు చాలా మంచోడు అయ్యే దుర్మార్గులకు కూడా వరాలు ఇస్తాడు.. వీళ్ళ అంతు  చూడాలంటే కావాల్సింది జాలి, కరుణ, దయలేని అసురుడు అంటూ ఒక బ్యాక్ గ్రౌండ్ డైలాగుతో గ్లింప్స్ మొదలవుతుంది. బాలయ్య  ఎలివేషన్ హైలెట్ చేసేలా చూపించారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ కూడా ఒక రేంజ్ లో ఉన్నాయని చెప్పవచ్చు. బాలయ్య ఇందులో రెండు బ్యాగులతో నెక్స్ట్ లెవెల్ లో ఎంట్రీ ఇచ్చారు. చివర్లో బాలయ్య శత్రువు తలనరికి గుర్రం పైన స్వారీ చేస్తున్నట్లుగా చూపించడం హైలైట్ గా నిలుస్తోంది.

మొత్తానికి మేకర్స్ ఇచ్చిన అప్డేట్ మాత్రం అభిమానులకు అదిరిపోయేలా బాలయ్యను చూపించారనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య రోల్ కు బాబి ఇచ్చినా ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని కూడా తెలియజేస్తున్నారు. బాలయ్యను మాస్ లుక్ లో కూడా చూపించడమే కాకుండా అదిరిపోయే యాక్షన్ సీన్స్ ని చూపించారు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తమన్ మరొకసారి అదరగొట్టేసారని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నట్లు ఫ్యాన్స్ చెబుతున్నారు. బాలీవుడ్ స్టార్ నటుడు బాబి డియోల్ విలన్ గా నటిస్తూ ఉన్నారు. అలాగే చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా వంటి వారు ఇందులో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ టీజర్ అయితే వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: