టీవీ ప్రీమియర్ కి సిద్ధమైన ఫ్యామిలీ స్టార్.. టెలికాస్ట్ ఎక్కడంటే..!

lakhmi saranya
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం ఫ్యామిలీ సార్. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్ల వద్ద తీవ్రంగా నిరాశ మిగిల్చింది. పరుశురాం డైరెక్షన్లో వచ్చిన ఈ ఫ్యామిలీ స్టార్ మూవీ బోల్తా కొట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. పూర్తిగా మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. ఇక ఓటీడీలో ఈ మూవీ పరవాలేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యేందుకు సిద్ధమైంది. టీవీ ప్రీమియర్ వివరాలు తాజాగా వెళ్ళుడయ్యాయి.
ఈ ఫ్యామిలీ స్టార్ మూవీ ఈ ఆదివారం అనగా జూన్ 16వ తేదీన సాయంత్రం 6 గంటలకు స్టార్ మా చానల్లో టెలికాస్ట్ కానుంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అంటూ ఈ వివరాలను ఈ ఛానల్ వెల్లడించింది. ఇక ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. థియేటర్లలో నిరాశపరిచిన నీ ఫ్యామిలీ స్టార్ సినిమా ఓటీడీలో మంచి ఆదరణ దక్కించుకుంటుంది. ఇక థియేటర్లలో విడుదలైన మూడు వారాల్లోనే ఏప్రిల్ 26వ తేదీన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటిలో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇక ఇప్పుడు టీవీ ప్రీమియర్ కి కూడా వచ్చేస్తుంది. మరి ఓటిటిలో అంతంత మాత్రమే అనిపించుకున్న ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ లో ఏ విధమైన రెస్పాన్స్ దక్కించుకుంటుందో వేచి చూడాలి.
ఈ మూవీ ముందు వరకు బడబడా హీరోలతో జతకట్టి వరుస హ్యాట్రిక్ హిట్లు కొట్టిన మృణాల్ ఠాకూర్ కి ఈ సినిమా పెద్ద దెబ్బ వేసిందని చెప్పుకోవచ్చు. విజయ్ దేవరకొండ విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ చేసిన ప్రతి సినిమా కథ కొంతకాలం నుంచి థియేటర్లో వద్ద ఫ్లాప్ గానే నిలుస్తుంది. దీంతో ఈ మూవీ ఫ్లాప్ అయినా తన అభిమానులు పేదగా నిరాశ పడలేదు. కానీ ఇప్పటివరకు హ్యాట్రిక్ హిట్లతో ఉన్న మృణాల్ ఠాకూర్ ఖాతాలో మొట్టమొదటిసారి ఓ ప్లాప్ పడడంతో తన ఫాన్స్ నిరాశపడుతున్నారు. మరి తన తదుపరిచిత్రంతో ఆయన సూపర్ హిట్ విజయం కొట్టి ఈ లోటును తీరుస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: