రేవంత్ రెడ్డి: జగన్ ను అందుకే తరిమికొట్టారు..?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాల వాళ్లే వైసిపి పార్టీకి ఈ దుస్థితి నెలకొందని... సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై స్పందించారు.

ముఖ్యంగా ఏపీ రాజకీయాలపై రేవంత్ రెడ్డి హాట్ కామన్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని కతం చేయాలని... జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేశాడని... కానీ ఇప్పుడు ఆయనే కతం అయ్యారంటూ... మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ప్రజా పాలనను విస్మరించినందుకు... మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు గుణపాఠం చెప్పారని చురకాల అంటించారు రేవంత్ రెడ్డి.

ఆయన చేసిన పాపాల కారణంగా వైసిపి పార్టీ తుడిచిపెట్టుకుపోయింది అని... ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి సంబంధించిన అక్రమాల వల్ల పరిశ్రమలు కుప్పకూలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దెబ్బతింది అంటూ హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తే హైదరాబాదులో జగన్ ఇంటి వద్ద నిర్మాణాలు కూల్చివేసామన్నది అబద్ధమని.. సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అదంతా... బ్లూ మీడియా  తప్పుడు ప్రచారం అంటూ మండిపడ్డారు.

ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ... రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారని వివరించారు. ఇక తెలంగాణ మంత్రి మండలి కూర్పు అలాగే ఆర్గనైజేషన్ గురించి ఢిల్లీలో చర్చించినట్లు తెలిపారు. బిజెపి అలాగే గులాబీ పార్టీలు రెండు కలిసి... కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామని వరుసగా ప్రకటనలు చేస్తున్నాయని... కాంగ్రెస్లో చేరికల అంశంపై కూడా చర్చించామని తెలిపారు. అయితే కాంగ్రెస్లో మొదటి నుంచి ఉన్న వాళ్లకు మంచి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: