వసూళ్లలో జోరు చూపిస్తున్న కల్కి.. నార్త్ అమెరికాలో సెన్సేషన్?

Purushottham Vinay
వసూళ్లలో జోరు చూపిస్తున్న కల్కి.. నార్త్ అమెరికాలో సెన్సేషన్?
కల్కి 2898 AD ఫస్ట్ షో నుంచి అన్నిచోట్ల ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతన్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ సినిమా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.యంగ్ డైరెక్టర్ మహా నటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయగా మామయ్య టాలీవుడ్ సీనియర్ నిర్మాత ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు.రెండ్రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 298.50 కోట్లని వసూలు చేయడం జరిగింది. మహాభారత పాత్రలను తీసుకొని నాగ్ అశ్విన్ కథ అల్లుకున్న తీరు, వాళ్లను చూపించిన విధానానికి అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ బిగ్ బాస్ అమితాబ్ బచ్చన్, నటి దీపికా పడుకోన్ ఇంకా దిశా పఠాని లు ముఖ్య పాత్రల్లో నటించారు.ఈ సినిమాకి ఇండియా వైడ్ సెన్సేషనల్ క్రేజ్ నెలకొనగా ఈ క్రేజ్ తో ఇండియా వైడ్ భారీ భారీ బుకింగ్స్ ని ప్రీ సేల్స్ నుంచే ఈ చిత్రానికి వచ్చాయి.

అలా ఇప్పుడు సినిమా బుకింగ్స్ విషయంలో ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ సినిమా కూడా అందుకోని అరుదైన రికార్డు కొట్టినట్టుగా తెలుస్తుంది.గడిచిన 24 గంటల్లో కల్కి సినిమాకి బుక్ మై షో లో ఏకంగా 1.28 మిలియన్ టికెట్స్ అమ్ముడుపోయాయని సమాచారం తెలుస్తుంది.నిజంగా ఇదొక సంచలనం అని చెప్పాలి. ఇక శనివారం రోజు కల్కి 2898 ఏడీ మూవీ వరల్డ్ వైడ్‌గా ఏకంగా 117 కోట్ల గ్రాస్ ను దాటేసిందని తెలుస్తుంది.. అంటే మొత్తం మీద ఈ సినిమా నిన్నటిదాకా 415 కోట్ల పైగా వసూల్ చేసింది.. ఇక ఇండియాలో సుమారుగా ఈ చిత్రం 80 కోట్ల కు పైగా షేర్ ఇంకా అలాగే 100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మూడో రోజు 415 కోట్ల కలెక్షన్స్ పైగా వసూలు చేసి సెన్సేషనల్ రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఇక నార్త్ అమెరికాలో అయితే ఈ సినిమా యానిమల్, జవాన్, ఆర్ ఆర్ ఆర్ సినిమాలని బీట్ చేసేస్తోంది. ఇక ఈరోజు ఆదివారం ఎంత సాధిస్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: