చంద్రబాబు: టీడీపీ నాయకులను వేటాడేందుకు కొత్తగా రెడ్ బుక్ ?

Veldandi Saikiran
టీడీపీ నాయకులను వేటాడేందుకు కొత్తగా రెడ్ బుక్ తీసుకొచ్చారు పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యే శ్యాంబాబు. తాజాగా పత్తికొండలో రెడ్ బుక్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే శ్యాంబాబు. ఈ సందర్భంగా పత్తికొండ టిడిపి ఎమ్మెల్యే శ్యాంబాబు హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత కొందరు దళారులు ఎమ్మెల్యే పేరు చెప్పి డబ్బులు దండుకుంటున్నారని ఆగ్రహించారు ఎమ్మెల్యే శ్యామ్ బాబు. అయితే... అలా డబ్బులు వసూలు చేసే వారి ట్రాప్‌ లో పడి... ఎవరు డబ్బులు ఇవ్వద్దని కోరారు.

కొంత మంది టిడిపి నాయకులు, కార్యకర్తలు నాకు బంధువులని, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు దోచుకుంటున్నారని ఆగ్రహించారు ఎమ్మెల్యే శ్యామ్ బాబు. ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, నన్ను కలిసి  పనులు చేయించుకోండని స్పష్టం చేశారు. వైసీపీలో జరిగిన అక్రమాలు టిడిపిలో జరగకూడదని కోరారు ఎమ్మెల్యే శ్యామ్ బాబు. పత్తికొండ నియోజకవర్గంలో మండలానికి ఒక ఫిర్యాదులు, సలహాల బుక్ అందుబాటులో ఉంటుందని చెప్పారు.

టీడీపీ ఆఫీస్ లో బుక్ కూడా అందుబాటులో ఉంటుంది, ఎవరైనా డబ్బులు అడిగినా ఆ బుక్ లో నమోదు చేయండన్నారు ఎమ్మెల్యే శ్యాంబాబు. టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని అన్యాయానికి పాల్పడితే వారి టిడిపి సభ్యత్వం రద్దు చేస్తామని హెచ్చరించారు. అలాంటి వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని తెలిపారు.

రాజకీయ లబ్ది కోసం వాలంటరీ వ్యవస్థ లేకపొతే పింఛను పంపిణీ జరగదని వైసీపీ అసత్య ప్రచారంకు టీడీపీ ప్రభుత్వం స్వస్తి పలికిందని వెల్లడించారు.  పింఛన్లు కోసం ఎండల్లో తిరిగి చనిపోయిన 34 మంది మరణానికి జగన్ మోహనరెడ్డి కారణం అయ్యారని నిప్పులు చెరిగారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర చరిత్రలో జులై 1 వ తేదీ చారిత్రకమైన రోజు అని వివరించారు ఎమ్మెల్యే శ్యాంబాబు. ఇచ్చిన మాటకు కట్టుబడి పెంచిన పింఛన్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు అందించారని గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: