ఆరోజు.. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నా : గంభీర్

praveen
టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో భారత జట్టు రెండు వరల్డ్ కప్ లు గెలిచింది అని మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఇలా వరల్డ్ కప్ లు గెలవడంలో అప్పుడు టీమిండియా ఓపెనర్ గా ఉన్న గౌతమ్ గంభీర్ కీలక పాత్ర వహించాడు అన్న విషయం కేవలం కొంతమందికి మాత్రమే తెలుసు. ఎప్పుడు అద్భుతమైన ప్రదర్శన చేసి వీరోచితమైన ఇన్నింగ్స్ లతో ఇక టీమిండియాను విజయ తీరాలకు నడిపించడంలో సక్సెస్ అయ్యాడు గౌతమ్ గంభీర్.

 ఇలా తన ఆట తీరుతో కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు అని చెప్పాలి. అయితే కేవలం క్రికెట్ తో మాత్రమే కాకుండా ఇక తన యాటిట్యూడ్ తో కూడా వార్తల్లో నిలుస్తూ ఉండేవాడు గౌతం గంభీర్. ఎప్పుడు ముక్కు సూటిగా మాట్లాడుతూ ఉండేవాడు  దీంతో గౌతమ్ గంభీర్ ఏం మాట్లాడినా కూడా అది సరికొత్త వివాదానికి దారితీస్తూ ఉండేది అని చెప్పాలి. అయితే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా ఇక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడు వార్తలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉన్నాడు ఈ మాజీ ప్లేయర్. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్ గంభీర్ తాను 11 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు.

 తనకు 11 ఏళ్లు ఉన్నప్పుడు 1992 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలు అయింది అంటూ భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు. ఆరోజు రాత్రంతా ఏడుస్తూనే ఉండిపోయాను అంటూ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆ సమయంలో భారత జట్టు కోసం వన్డే వరల్డ్ కప్ సాధించాలని ఫిక్స్ అయ్యాను. ఆ కల 2011లో నెరవేరింది అంటూ గౌతమ్ గంభీర్ తెలిపాడు. కాగా 2007 t20 వరల్డ్ కప్ 2011 వన్డే వరల్డ్ కప్ గెలవడంలో గౌతం గంభీర్ టీమిండియా ఓపెనర్ గా కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. కాగా ఈ మాజీ ప్లేయర్ మరికొన్ని రోజుల్లో అటు టీమిండియా హెడ్ కోచ్ పదవీ బాధ్యతలు కూడా చేపట్టబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: