బాబు - రేవంత్: ప్రతి పక్షాలను వణికించనున్న గురు శిష్యులు?

Purushottham Vinay

• రేవంత్, బాబు భేటీ ఇక ప్రత్యార్థులకు అలసటే!

 

• శత్రువులపై పగ తీర్చుకోడానికి రెడీగా ఉన్న రేవంత్, బాబు! 


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న సమావేశమయ్యి విభజన సమస్యలతో పాటు ఇతరత్రా అంశాలను కూడా చర్చించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తమ రాజకీయ ప్రత్యర్థులు కేసీఆర్, జగన్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇవ్వాలని ఆ ఇద్దరు సీఎంలు నిర్ణయించుకున్నట్లు సమాచారం తెలిసింది. గతంలో ఆంధ్రప్రదేశ్ సీఎం గా జగన్, తెలంగాణ సీఎం గా కెసిఆర్ పరిపాలించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కొంతకాలం హైదరాబాదులోనే చంద్రబాబు ఉన్నారు. కానీ ఫోన్ టాపింగ్ వివాదంతో చంద్రబాబు నాయుడు ఉన్నపలంగా అమరావతి వెళ్లాల్సి వచ్చింది. అప్పటి నుంచి కెసిఆర్ తో చంద్రబాబుకు రాజకీయ విభేదాలనేవి కొనసాగుతూ వచ్చాయి.2018లో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ఇచ్చారు చంద్రబాబు. కానీ అక్కడ ఫలితాలు ప్రతికూలంగా వచ్చాయి. అప్పటి నుంచి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం కావడానికి కెసిఆర్ ప్రధాన కారణమని చంద్రబాబుకు కోపం ఉంది. 


2019 ఎన్నికల్లో ఏపీలో తనను దారుణంగా దెబ్బతీసేందుకు జగన్ కు కెసిఆర్ ఆర్థిక సాయం చేశారు అన్న అనుమానం కూడా చంద్రబాబు నాయుడుకు ఉంది.మొన్నటికి మొన్న అవినీతి కేసుల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు హైదరాబాదులో నిరసనలకు అనుమతి కూడా ఇవ్వలేదు కెసిఆర్ ప్రభుత్వం. అందుకే మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంది తెలుగుదేశం పార్టీ.కాంగ్రెస్ పార్టీ విజయానికి మార్గం సుగమం చేసింది.కెసిఆర్ అధికారంలో ప్రధాన బాధితులు ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి. రేవంత్ ద్వారా చంద్రబాబు చుట్టూ ఉచ్చుబిగించి చంద్రబాబుని ఏపీకి పంపించారు. 


రేవంత్ ను జైల్లో పెట్టి హింసించారు కెసిఆర్. అదే రేవంత్ కు ఇమేజ్ తెచ్చి పెట్టింది. తెలంగాణలో ఆయనకి అధికారంలోకి తెచ్చిపెట్టింది. అందుకే ఇప్పుడు కెసిఆర్ ను కట్టడి చేసే పనిలో పడ్డారు రేవంత్ రెడ్డి. అటు ఏపీలో జగన్ ని కట్టడి చేస్తున్నారు చంద్రబాబు. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. అందుకే ఈ ఇద్దరు సీఎంలు తమ ప్రత్యర్థులపై  ఏ విధంగా రివేంజ్ తీర్చుకుంటారనేది ఇప్పుడు హార్ట్ టాపిక్ గా మారింది. కెసిఆర్, జగన్ కూడా వీళ్ళు తమని ఎప్పుడు ఏం చేస్తారో అని ఆందోళనలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: