‘RRR’ రికార్డ్ బ్రేక్ చేసిన ' మన శంకర వర ప్రసాద్ ' .. డే 5 ఆల్ టైం రికార్డ్...!
రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'RRR' పేరిట ఉన్న ఒక కీలకమైన రికార్డును ఈ సినిమా బద్దలు కొట్టడం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇప్పటివరకు 'RRR' అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే ఐదవ రోజు వసూళ్ల విషయంలో మెగాస్టార్ సినిమా సరికొత్త చరిత్ర లిఖించింది. గతంలో 'RRR' చిత్రానికి ఐదవ రోజు వచ్చిన మొత్తం షేర్ వసూళ్లను 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ ఏకంగా ఒక కోటి రూపాయల భారీ తేడాతో అధిగమించింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సింగిల్ డే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఇది ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. పాన్ ఇండియా స్థాయి కాకుండా కేవలం తెలుగు భాషలో విడుదలైన ఒక సినిమా ఈ స్థాయి ప్రభంజనం సృష్టించడం మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ సత్తాను చాటిచెబుతోంది.
ఈ సినిమాలో చిరంజీవి సరసన విక్టరీ వెంకటేష్ నటించడం పెద్ద అడ్వాంటేజ్‌గా మారింది. ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు పోటీపడి నటించిన తీరు ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టిస్తోంది. అనిల్ రావిపూడి తనదైన మార్కు హాస్యం, ఎమోషన్స్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేశాడు. సంక్రాంతి సీజన్ కావడంతో కుటుంబం మొత్తం కలిసి థియేటర్లకు వస్తుండటంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా అదరగొడుతోంది. ముఖ్యంగా అమెరికా బాక్సాఫీస్ వద్ద మిలియన్ డాలర్ల మార్కును అతి తక్కువ సమయంలోనే దాటినట్లు తెలుస్తోంది.
ప్రస్తుత ఊపును గమనిస్తే రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని విస్మయకరమైన ఫలితాలను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. వర్కింగ్ డేస్‌లో కూడా థియేటర్లు హౌస్‌ఫుల్ కావడం మెగా మల్టీస్టారర్ మ్యాజిక్‌కు నిదర్శనం. సోషల్ మీడియాలో ఈ చిత్రంపై వస్తున్న సానుకూల స్పందన వసూళ్లను మరింత పెంచుతోంది. ముఖ్యంగా నైజాం, సీడెడ్ ప్రాంతాల్లో సినిమా కలెక్షన్లు ట్రేడ్ అనలిస్టుల అంచనాలను మించిపోయాయి. లాంగ్ రన్ లో ఈ సినిమా మరిన్ని భారీ చిత్రాల లైఫ్ టైమ్ కలెక్షన్లను కూడా దాటే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ రాబోయే కాలంలో ఇంకా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.