`రప్పా-రప్పా..` వైసీపీకి ఎంత డేంజరో తెలుస్తోందా.. !
ముఖ్యంగా ఏడాదిన్నర తర్వాత కూడా.. పార్టీలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. నిజానికి గత 2019 ఎన్నికల తర్వాత.. టీడీపీ గ్రాఫ్ పెరిగింది. రెండేళ్ల కరోనా ఉన్నప్పటికీ.. అప్పట్లోనే చంద్రబాబు.. జూమ్ సమావేశాల ద్వారా విదేశీ వైద్యులతో కార్యక్రమాలు నిర్వహించి.. ప్రజలకు మేలు చేసేందుకు ప్రయత్నిం చారు. తద్వారా.. చంద్రబాబుతన గ్రాఫ్‌ను నిలబెట్టుకున్నారు. ఇక, కరోనా అనంతరం.. వైసీపీ సర్కారుపై యుద్ధభేరీ మోగించి.. ప్రజలకు అనుకూల విధానాలపై ఎలుగెత్తారు.
ఇలా.. చంద్రబాబు ఒక వ్యూహం ప్రకారం వ్యవహరించి..ఓడిపోయినప్పటికీ పార్టీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ తరహా పరిస్థితి లేకపోవడంతో పాటు.. అమరావతి సహా.. విచ్చలవిడి విధానాలకు జగన్ పచ్చజెండా ఊపడంతో పార్టీ పై `రప్పా రప్పా` ముద్ర బలంగా పడిపోయింది. ఒకప్పుడు క్షేత్రస్థాయి లో జగన్ పార్టీ అని.. వైసీపీ అని పిలిచేవారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో అయితే.. వైసీపీని జగన్ పార్టీ అనే పిలుస్తున్నారు. అలాంటి పార్టీ.. ఇప్పుడు.. రప్పా రప్పా పార్టీ అయిపోయింది.
ఈ ముద్ర వల్ల పార్టీకి దీర్ఘకాలిక నష్టం వాటిల్లడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం రా ష్ట్రంలో వైసీపీ పేరు స్థానంలో రప్పా-రప్పా పేరు వినిపిస్తోంది. దీంతో నాయకులు కూడా తలెత్తుకునే పరి స్థితి లేకుండా పోయింది. ఇక, యువత మాట పక్కన పెడితే.. వృద్ధులు, మహిళలు అయితే.. వైసీపీని దూ రం పెడుతున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీకార్యకర్తలుఅనుసరించిన విధానాలు.. వాటిని కట్టడి చేయలేని దై న్యం వంటివి వైసీపీని ఇరుకున పెట్టాయనే చెప్పాలి. ఏదేమైనా వైసీపీకి రప్పా-రప్పా.. భారీ డ్యామేజీ అయితే చేస్తోందని అంటున్నారు విశ్లేషకులు.