ఏపీ: వారిపై పవన్ కళ్యాణ్ ఫైర్.. నేరం రుజువైతే జైలుకేనా..?

Pandrala Sravanthi
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా  ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన దూకుడు పెంచేశాడు. పాలనలో తనదైనా మార్క్ చూపించబోతున్నారు. ఇదే తరుణంలో ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతూ పిసిబి ఫైల్స్ రిపోర్టుల దగ్ధంపై ఆరా తీశారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు ఏంటో చూద్దామా.  కృష్ణ కరకట్టపై బస్తాల కొద్ది రికార్డులను దగ్ధం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ ఫైల్స్ దగ్ధం చేయడంలో సహాయపడిన ఎవరైనా సరే వారిని చట్ట ప్రకారం గుర్తించి అదుపులోకి తీసుకోవాలన్నారు.  పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంతేకాకుండా కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించినటువంటి ఫైల్స్  మంటల్లో కాలిపోవడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. 

ఈ కుట్ర కోణం వెనుక ఎవరెవరు ఉన్నారు.  దీనికి బాధ్యత వహించిన ఎవరైనా సరే చట్ట ప్రకారం శిక్షర్హులని అన్నారు.  అంతేకాకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో ఇప్పుడు ఉన్నటువంటి ఫైల్స్ ఏ మేరకు భద్రపరిచారు భద్రపరచడం కోసం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏమిటనేది, అధికారులు  వెంటనే తెలియజేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అంతే కాకుండా  విజయవాడలోని అవనిగడ్డ కరగట్టపై బస్తాల కొద్దీ ఫైళ్లను తగలబెట్టడమే కాకుండా, మైనింగ్ శాఖకు చెందిన రికార్డులు కూడా ధ్వంసం చేశారు.

అలాగే యనమలకుదురు కట్ట రోడ్డు వెంట సిబ్బంది రికార్డులు కూడా తగలబెట్టారు. ఈ విధంగా ఫైల్స్ తగలబెట్టే విషయం బయటకు రావడంతో పవన్ కళ్యాణ్ విపరీతంగా కోపానికి వస్తున్నారు. ఫైల్స్ తగలబెట్టే దాంట్లో ఎవరి పాత్ర ఉన్నా సరే వారిని వదిలిపెట్టేది లేదని, ఎంతటి వారైనా  సరే విచారణ చేసి తప్పు చేస్తే జైలుకు పంపించాల్సిందే అని అన్నారు. మరి చూడాలి దీనిపై  అధికారులు ఎలాంటి విచారణ జరుపుతారు అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: