గురు శిష్యులు తెలుగు రాష్ట్రాలని డ్రగ్స్ నుంచి కాపాడతారా?
* తెలుగు రాష్ట్రాలు గంజాయి రహిత రాష్ట్రాలు అవుతాయా?
* రేవంత్, బాబు డ్రగ్స్ నుంచి యువతని కాపాడగలరా?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు భేటీలో ప్రస్తావించిన అంశాలను రెండు రాష్ట్రాల మంత్రులు కూడా జాయింట్ ప్రెస్‌మీట్ పెట్టి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి.. 10 ఏళ్లు పూర్తయినా విభజన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని.. వాటిపై ఈ సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యాంటీ నార్కొటిక్స్ డ్రైవ్స్ చేయాలని నిర్ణయించామని.. సైబర్ నేరాలు అరికట్టేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అలాగే డ్రగ్స్, సైబర్ క్రైమ్స్‌పై ఇరు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని నిర్ణయించామని చెప్పారు. ఇక ఈమధ్యనే ఏపీలో కూడా యాంటీ నార్కొటిక్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయడం గమనార్హం.గంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి రెండు రాష్ట్రాలు కలిసి కార్యాచరణ చేపట్టాలని రేవంత్, చంద్రబాబు డిసైడ్ అయ్యారు.
రాష్ట్ర విభజన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి మందుకు రావడం శుభపరిణామం. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి గంజాయి సరఫరా అవుతుంది కాబట్టి డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ఏపీలో కూడా చర్యలు తీసుకునేందుకు బాబు, రేవంత్ సిద్ధం అయ్యారు. డ్రగ్స్ వ్యసనం అనేది చాప కింద నీరులా పాకిపోతుంది. చాలా మంది యువత కూడా డ్రగ్స్ కి బానిసయ్యి తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్ ఎంతలా పీడిస్తుందంటే..ప్రస్తుతం పిల్లల స్కూలు బ్యాగుల్లో కూడా గంజాయి దొరికే పరిస్థితి ఉంది. అందుకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను డ్రగ్ రహిత రాష్ట్రాలుగా తీర్చిదిద్దేందుకు బాబు, రేవంత్ అన్ని ప్రయత్నాలు చేసేందుకు సిద్ధం అయ్యారు. మరి చూడాలి రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్య మంత్రులుగా కొనసాగుతున్న ఈ గురు శిష్యులు తెలుగు రాష్ట్రాలను పూర్తిగా గంజాయి రహిత రాష్ట్రాలుగా తీర్చిదిద్దుతారో లేదో అనేది..