ప్రీ రిలీజ్ మిస్సైనా సక్సెస్ ఈవెంట్ పెట్టండి అంటున్న ఫ్యాన్స్..!
ఐతే అప్పటికే అనంతపురం లో ఈవెంట్ అంటూ ఫ్యాన్స్ హంగామా మొదలు పెట్టారు. చాలా కాలంగా ఇలాంటి ఒక ఈవెంట్ అది కూడా రాయలసీమలో ప్లాన్ చేయడం స్పెషల్ గా అనిపించింది. కానీ తిరుపతి ఘటన వల్ల ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. ఐతే ఈవెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత ఫ్యాన్స్ మాట్లాడుతూ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. కాబట్టి సక్సెస్ మీట్ అయినా ఇక్కడ చేయండంతూ కోరుతున్నారు.
డాకు మహారాజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయినందుకు నందమూరి ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయినా కూడా బాలయ్య తమ కోరిక మన్నించి డాకు మహారాజ్ సక్సెస్ పార్టీ ఈవెంట్ అనంతపురం లో పెట్టాలని కోరుతున్నారు. మరి మేకర్స్ సక్సెస్ ఈవెంట్ అక్కడ పెడతారా లేదా అన్నది చూడాలి. బాబీ అండ్ టీం మాత్రం డాకు మహారాజ్ రిజల్ట్ మీద చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమాలో బాలయ్యతో కలిసి శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వసి రౌతెల, ప్రగ్యా జైశ్వాల్ లు నటించారు. అఖండ టైం లో థమన్ మ్యూజిక్ కి స్పీకర్లు బద్ధలయ్యాయి. ఇప్పుడు డాకు మహారాజ్ కు థమనే స్పెషల్ మ్యూజిక్ అందించాడు.