ఆడియన్స్ పల్స్ పట్టేసిన కొండన్న.. హైందవ టీజర్ అదిరిందిగా..!!

murali krishna

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నెక్స్ట్ సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేసారు. మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ పై లుదీర్ బైరెడ్డి నిర్మాణంలో మహేష్ చందు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.BSS 11 వర్కింగ్ టైటిల్ తో ఇటీవల ఈ సినిమాని ప్రకటించారు. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమాకు హైందవ అనే టైటిల్ ప్రకటిస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు.ఈ గ్లింప్స్ చూస్తుంటే ఇదేదో మైథలాజికల్ థ్రిల్లర్ సినిమాలుగా అనిపిస్తుంది. ఈ గ్లింప్స్ లో కొంతమంది దుండగులు ఓ గుడిని తగలబెడదాం అనుకుంటే శ్రీనివాస్, ఓ వరాహం, ఓ సింహం వచ్చి కాపాడినట్టు చూపించారు. అలాగే బ్యాక్ గ్రౌండ్ లో విష్ణుమూర్తి దశావతారాలు చూపించారు. ఇదేదో బాగానే వర్కౌట్ అయ్యేలా అనిపిస్తుంది. గ్లింప్స్ లో షాట్స్ అయితే అదిరిపోయాయి.ఈ హైందవ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయనున్నారు. వరుసగా యాక్షన్ సినిమాలతో వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చివరగా తెలుగులో 2021లో అల్లుడు అదుర్స్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా వచ్చి నాలుగేళ్లు అయిపోతుంది. మధ్యలో హిందీ ఛత్రపతి సినిమా తప్ప ఇంకే సినిమా రాలేదు శ్రీనివాస్ నుంచి. దీంతో శ్రీనివాస్ అసలు సినిమాలు చేస్తున్నాడా అనే సందేహాలు కూడా వచ్చాయి. కానీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన రెగ్యులర్ యాక్షన్ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి కొత్త కొత్త కథలతో రాబోతున్నాడు.త్వరలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో శ్రీనివాస్ తో పాటు మనోజ్, నారా రోహిత్ కూడా నటిస్తున్నారు. ఆ తర్వాత భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు సినిమాతో రాబోతున్నాడు. అలాగే BSS12 సినిమా కూడా అనౌన్స్ చేసారు. మరో రెండు సినిమాలు కూడా శ్రీనివాస్ చేతిలో ఉన్నాయి. కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చినా త్వరలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాబోతున్నాడు శ్రీనివాస్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: