ఏపీ: తిరుపతి ఘటనపై చంద్రబాబు సంచలన నిర్ణయం.!

FARMANULLA SHAIK
తిరుపతి తొక్కిసలాట ఘటన జరగడం అత్యంత బాధాకరం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.మరోవైపు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 35 మందికి రూ.2 లక్షలు చొప్పున సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడిన క్షతగాత్రులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అలాగే వారిని ప్రభుత్వ ఖర్చులతోనే వారి వారి నివాసాల వద్దకు చేరుస్తామని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ ఘటనలో జవాబుదారీతనం లేకుండా పనిచేసిన డీఎస్పీ రమణ కుమార్‌తోపాటు గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిలను సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వీరితోపాటు టీటీడీ అధికారులను సైతం ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, జేఈవో గౌతమి, టీటీడీ ముఖ్య భద్రతాధికారి శ్రీధర్‌ను బదిలీ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ చర్యలతోపాటు తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించినట్లు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

ఇదిలావుండగా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి శ్రీవారి దర్శనానికి టోకెన్ల జారీ విధానాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చిందని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తిరుపతిలో టికెట్లు ఇవ్వడం కరెక్ట్ కాదని ప్రతి ఒక్కరూ చెబుతున్నారన్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజులేనని, 10 రోజులు ఎందుకు చేశారో తెలియదంటూ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఆగమ శాస్త్రాలు దీన్ని అంగీకరిస్తాయో కూడా తెలియదని.. శ్రీవారు వెలిసినప్పటి నుంచి ఉన్న సంప్రదాయాలను ఉల్లంఘించడం కరెక్టేనా అంటూ నిలదీశారు. ఈ అంశంపై ఆగమ పండితులు త్వరగా నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.ఈ క్రమంలోనే తిరుపతిలో రాజకీయాలు చేసేందుకు వీలు లేదని సీఎం చంద్రబాబు నాయుడు ఖరాఖండిగా తేల్చి చెప్పేశారు. ఇలాంటి ఘటనలు జరగ కూడదని ఓ భక్తుడిగా తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. అనాలోచిత నిర్ణయాలతో దేవుడిని అప్రతిష్టపాలు చేయొద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: