నిమ్మకాయ ముక్కను ఫ్రిజ్ లో ఉంచితే ఏమవుతుందో తెలుసా!
మీరు నిమ్మకాయను ముక్కలుగా చేసి మీ ఫ్రిజ్లో ఉంచితే ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఆహార పదార్థాలు ఫ్రిజ్లో నిల్వ చేస్తుంటాము. వాటి శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. నిమ్మ ఎంతగానో ఉపయోగపడుతుంది. నిమ్మకాయలు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది ఫ్రిజ్లో ఉన్న బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా, ఫ్రిజ్లోని గాలిని సహజంగా శుభ్రంగా ఉంచడంలో కూడా ఇది సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ప్లీజ్ శుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, కొన్నిసార్లు దుర్వాసన సమస్య కొనసాగుతూనే ఉంటుంది. చాలాసార్లు ఈ వాసన రిఫ్రిజిరేటర్ లో ఉంచున ఆహాన పదార్థాలలో కూడా కనిపిస్తుంటాంది.
అటువంటి పరిస్థితుల్లో ఈ వాసన సమస్యను దూరంగా ఉంచడానికి సులభమైన మార్గం నిమ్మకాయను రెండు ముక్కలుగా చేసి రిఫ్రిజిరేటర్ లో ఉంచడం. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ ఆసిడ్ ఫ్రిజ్లోని దుర్వాసనను దూరం చేస్తుంది. గాలిని సహజంగా తాజాగా సువాసనగా ఉంచుతుంది. చాలా ఆహార పదార్థాలను ఫ్రిజ్లో ఉంచుతారు. రిఫ్రిజిరేటర్ లో ఉంచిన తర్వాత కూడా త్వరగా చెడిపోయేవి కొన్ని ఉన్నాయి. వాటిని ఎక్కువ కాలం తాజాగా ఉంచేందుకు నిమ్మ రసాన్ని ఉపయోగించవచ్చు. నిమ్మకాయలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆహార పదార్థాలు ఎక్కువ కాలం కూళ్లిపోకుండా కాపాడి తాజాగా ఉంచుతాయి. అయితే, రిఫ్రిజిరేటర్ లో ఉంచడానికి ఎల్లప్పుడూ తాజా, శుభ్రమైన నిమ్మకాయను మాత్రమే ఉపయోగించండి.