చెరుకు రసం తీపి జంతికలు చెయ్యండి... పిల్లలు చాలా ఇష్టం గా తింటారు!

lakhmi saranya
పండగకు చేసే స్నాక్స్ కూడా చాలా స్పెషల్. ఎక్కువగా జంతికలు తయారు చేస్తూ ఉంటారు. వీటిని మురుకులు అని కూడా పిలుస్తారు. సాధారణంగా వీటిని కారంగా తయారు చేస్తారు. కానీ మనం వీటిని చెరుకు రసం కలిపి చేస్తే ఆహా ఆ రుచి వేరు. చాలా బాగుంటాయి. ఎక్కువగా పిల్లలకు మరింత నచ్చుతాయి. బాక్సుల్లో వీటిని స్నాక్స్ లా పెడితే బాక్స్ కాళీ అవుతుంది. సంక్రాంతి పండగ దగ్గర పడింది. ఈ ఏడాది జనవరి 13 వ తేదీ నుండి పండగ ప్రారంభం అవుతుంది.
సంక్రాంతి పండుగ వస్తుందంటే అందరూ ఆంధ్రప్రదేశ్ కి క్యూ కడతారు. ఇక్కడ వేసే కోళ్ల పందాలను చూడటం కోసం ఎక్కడి నుంచో వస్తారు. అలాగే పండగకు చేసే స్నాక్స్ కూడా చాలా స్పెషల్. ఎక్కువగా జంతికలు తయారు చేస్తూ ఉంటారు. పిల్లలు కోసం ఏం చేయాలో అని ఆలోచించే వారికి.. ఈ రెసిపీ పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు. మరి ఈ తీపి జంతికలు ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీ కి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో బియ్యం పిండి వేసుకోండి. అందులో కొద్దిగా ఉప్పు, నువ్వులు, బటర్ లేదా బేకింగ్ సోడా వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి.
నీళ్ళకు బదులు చెరుకు రసం వేసి మొత్తం పిండిని మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత ఓ పావుగంట పక్కన పెట్టాలి. ఈ లోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే... జంతికల గొట్టం ద్వారా... పిండిని తీసుకుని ఆయిల్ లో వేసే ఫ్రై చేసుకోవాలి. వీటిని రెండు వైపులా ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే చెరుకు రసం జంతికలు సిద్ధం. ఇవి చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు మరింత ఇష్టపడి మరీ తింటారు. అందులోనూ ఎందులో నువ్వులు కూడా ఉంటాయి. ఈ రెసిపీ ఆరోగ్యానికి చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: