శంకర్ ని అంత తక్కువ అంచనా వేస్తున్నారెందుకు..?
ఐతే ఈమధ్య కాస్త ఆయన ఫాం కోల్పోయారు. ఐ సినిమా నుంచి శంకర్ కంబ్యాక్ ఇవ్వలేకపోతున్నారు. 2.O ఓకే అనిపించినా కూడా మళ్లీ ఇండియన్ 2 డిజాస్టర్ అవ్వడంతో శంకర్ సినిమా అంటే సూపర్ అన్న వారే ఇప్పుడు బాబోయ్ అనేస్తున్నారు. ఐతే అన్ని సినిమాలు వేరు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వేరు. ఎందుకంటే ఈ సినిమా కథ మరో తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ అందించాడు.
శంకర్ వేరొకరి కథతో ఈ సినిమా చేశాడు. అంతేకాదు తన ప్రతి సినిమాలో ఉన్నట్టుగా ఇందులో కూడా సోషల్ మెసేజ్ ఉంది. సినిమాను చాలా లో ప్రొఫైల్ లో ఉంచుతున్నా దానికి ఆడియన్స్ ని థియేటర్ లో సర్ ప్రైజ్ చేయాలన్న రీజనే అని తెలుస్తుంది. ఐతే రామ్ చరణ్ సినిమా రేపు రిలీజ్ అయినా కూడా బజ్ లేదే అని మెగా ఫ్యాన్స్ బాధపడుతున్నారు. కానీ అక్కడ ఉంది శంకర్ ఆయన్ను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదని చెప్పొచ్చు. గేమ్ ఛేంజర్ తో బ్లాక్ బస్టర్ కొట్టి తిరిగి సూపర్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు శంకర్. సినిమా మీద ఉన్న ఈ లో ప్రొఫైలే ప్లస్ అయ్యేలా ఉందని అనిపిస్తుంది. గేమ్ ఛేంజర్ లో ఇది ఉంది అది లేదన్నట్టు కాకుండా అన్ని అంశాలు పొందుపరిచారని తెలుస్తుంది.