టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్ వైడ్ పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతోంది.ఈ సినిమాలో రామ్ చరణ్ కి జంటగా అంజలి, కియారా అద్వానీ నటించగా ఎస్జే సూర్య, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.అయితే గేమ్ ఛేంజర్ ప్రీమియర్స్ విషయంలో మేకర్స్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే రామ్ చరణ్ కూడా ఈసారి థియేటర్ కి వెళ్లకుండా కేవలం తన స్నేహితులు, సన్నిహితులతో కలసి అర్థరాత్రి సమయంలో ప్రయివేట్ థియేటర్లో చూసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఇదిలావుండగా గేమ్ ఛేంజర్ మూవీ స్టోరీ గురించి కొన్ని విషయాలు బయటికి వచ్చాయి. ఈ మూవీలో ఓ కట్టప్ప ఉన్నాడని, అలాగే మరి కొన్ని థ్రిల్లింగ్ విషయాలు ఉన్నాయని తెలుస్తుంది.తాజా సమాచారం ప్రకారం మూవీలో ఓ కట్టప్ప ఉన్నాడట. కట్టప్ప అంట బాహుబలి సినిమాలో హీరో పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచి చంపిన వ్యక్తి. అచ్చం అలాంటి వ్యక్తి గేమ్ ఛేంజర్ మూవీలో ఉంటారట.గేమ్ ఛేంజర్‌లో ఇప్పటి రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒక పాత్ర అప్పన్న.
ఆయన కుమారుడు రామ్ నందన్ పాత్రను కూడా రామ్ చరణే చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.అప్పన్న ఓ రాజకీయ పార్టీని పెడుతాడట. అది ప్రజాలకు చాలా దగ్గర అవుతుందట. ఆ టైంలో సీటు కోసం అప్పన్నను చంపేయాలని ఓ క్యారెక్టర్ చూస్తుందట. అలా అనుకున్నట్టే అప్పన్నను ఆ క్యారెక్టర్ చంపేస్తుందట. ఆ క్యారెక్టర్ ఎవరు అనేది సినిమాలో కనిపించే అతి పెద్ద ట్విస్ట్ అనేది సమచారం.మూవీలో సెకండాఫ్‌లో వచ్చే ఈ ట్వీస్ట్ సినిమాకు పెద్ద హైలైట్ గా ఉంటుందట. ఆ ట్విస్ట్ తర్వాత క్లైమాక్స్ భారీ స్థాయిలో ఉంటుందట. క్లైమాక్స్ విషయంలో శంకర్ మార్క్ కనిపిస్తుందట. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. థియేటర్ లో ఉన్న వాళ్లు అందరూ క్లైమాక్స్ కి ఫిదా అయిపోతారని టాక్.ఈ విషయం ఇలా ఉండగా పొలిటికల్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు మేకర్స్ కూడా బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనుకాడకుండా గేమ్ ఛేంజర్ సినిమాని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా తెరకెక్కించారు. దీంతో గ్లోబల్ వైడ్ గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని రామ్ చరణ్ ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.