ఏపీ: ఓటమి తర్వాత సీఎం పై ఫైర్ అయిన జగన్..!

Divya
ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఐదేళ్లలో వైసీపీ పరిపాలనలో అన్ని వర్గాల వారికి అన్ని పథకాలను అందించామంటూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ఓటమి తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది.. కేవలం టిడిపి పార్టీకి ఓటు వేయలేదు అన్న కారణంతోనే కార్యకర్తల ఆస్తుల ధ్వంసం చేస్తున్నారని అలాగే నేతలను ఇబ్బంది పెడుతున్నారని రాష్ట్రానికి రావణ కష్టం వచ్చేలా చేస్తున్నారని చంద్రబాబు పైన ఫైర్ అయ్యారు. అలాగే వైయస్సార్ విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తున్నారని ప్రజాస్వామ్యంలో ఇలాంటి రాజకీయాలు ఎక్కువ రోజులు నిలబడవు అంటూ హెచ్చరించారు.

తాము ప్రజలలో వ్యతిరేకత కారణంగా ఓడిపోలేదని కేవలం చంద్రబాబు వంటి నాయకుడు మోసపూరిత హామీల కారణాలవల్ల అధికారంలోకి వచ్చారని తెలియజేశారు. రైతు భరోసా కింద రైతులకు ఇస్తామన్న 20,000 ఏమయ్యాయి అంటూ ప్రశ్నించారు అలాగే అమ్మ ఒడి కింద తల్లులకు ఇస్తానన్న 15000 ఏమయ్యింది.. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళలకు నెలకు 1500 ఇస్తానని చెప్పుకున్న పథకం ఎప్పుడు ప్రారంభిస్తారు అంటూ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కూడా అక్రమంగా కేసులు పెట్టారని ఫైరయ్యారు జగన్.

పాల్వాయి గెట్ పోలింగ్ గేట్ లో పోలింగ్ బూతులో అన్యాయం చూడలేక ఈవీఎం పగలగొట్టిన ఆ ఘటన జరిగిన పది రోజుల తర్వాత అతనిపైన హత్యాయత్నం కేసు కూడా పెట్టారని సీట్ రిపోర్టులో ఈ విషయం ఎందుకు ప్రస్తావించలేదంటూ కూడా ఫైర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిపై ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం ఏంటా అంటూ ఫైర్ అయ్యారు. రెడ్ బుక్ ల పేరుతో దారుణంగా అన్యాయంగా ఆస్తులను సైతం ధ్వంసం చేస్తున్నారంటూ దొంగ కేసులు పెడుతున్నారంటూ జెసిపిల మీద నిలబడి ఎమ్మెల్యేలతో బిల్డింగులను కూల్చడం ఏంటా అంటూ ఫైర్ అయ్యారు. ఇలాంటివి ప్రజలు అసలు క్షమించారని చేతనైతే మంచి చేయి లేకపోతే తప్పుడు సాంప్రదాయాలను ప్రోత్సహించవద్దు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు పైన ఫైర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి ఇకనైనా ఇలాంటివి ఆపాలంటూ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: