అనిల్ రావిపూడి..
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్లలో ఈయన కూడా ఒకరు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో
సక్సెస్ ఫుల్ ప్ర
డైరెక్టర్ గా దూసుసుకపోతున్నారు
అనిల్ . అంతెకాకుండా.. ఈయర తెరకెక్కించిన సినిమాలన్ని సూపర్ హిట్ అందుకోవడంతో.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ ను వేసుకున్నారు. ముఖ్యంగా
అనిల్ రావిపూడి సినిమాలన్ని ఫన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉంటాయి. దీంతో ప్రేక్షకులు కూడా
అనిల్ డైరెక్షన్ లో వచ్చిన
సినిమా అంటే చాలా ఆసక్తి చూపుతారు. అంతేకాకుండా..
అనిల్ తన ప్రతి సినిమాలో కామెడీ, ఎమోషనల్ తో పాటు సమాజానికి ఉపాయోగపడే మంచి మెసెజ్ ను కూడా అందిస్తారు.అయితే ఈయన చివరిగా బాలకృష్ణతో భగవంత్
కేసరి సినిమాను తెరకెక్కించి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో ఈయన
వెంకటేష్,
వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తీసిన ఎప్ 2, ఎప్ 3 సినిమాలు కూడా మంచి సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ రెండు
దిల్ రాజు నిర్మాణ సంస్థలో రూపొందించడమే కాకుండా.. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వసూళ్లు చేశాయి. అయితే తాజాగా మరోసారి ఈ కాంబో తెరపై రిపీట్ కావడానికి సిద్ధంగా ఉంది. ఎఫ్2,
ఎఫ్3 వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత
విక్టరీ వెంకటేష్, స్టార్
డైరెక్టర్ అనిల్ రావిపూడి కలిసి మరోసారి వర్క్ చేయబోతున్న సంగతి తెలిసిందే. వీరి హ్యాట్రిక్ మూవీకి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది.
venky Anil3, SVC58 వర్కింగ్ టైటిల్స్ తో సినిమాను అధికారికంగా అనౌన్స్ చేసిన మేకర్స్.. జూలై 3 వ తేదీన
పూజా కార్యక్రమాలతో లాంఛనంగా షూటింగ్ ను ప్రారంభించబోతున్నట్లు తెలియజేశారు.
ఈ మేరకు ఒక పోస్టర్ ను విడుదల చేశారు. తాళి, గన్, గులాబీ పువ్వులతో చాలా ఇంట్రెస్టింగ్ గా తాజా పోస్టర్ డిజైన్ చేయబడింది.
లవ్ స్టొరీ, మ్యారేజ్ తో పాటుగా యాక్షన్ కూడా కావాల్సినంత ఉంటుందని సింబాలిక్ గా మేకర్స్ పోస్టర్ ద్వారా చెప్పకనే చెప్పారు. ఇకపోతే
అనిల్ రావిపూడి,
వెంకీ హ్యాట్రిక్ మూవీని
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై
దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.అలాగే ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌లను హీరోయిన్లుగా ఎంపిక చేశారు. వెంకటేష్ కు
వైఫ్ గా ఐశ్వర్య రాజేష్ మరియు ప్రియురాలిగా మీనాక్షి చౌదరి కనిపించనున్నారని తాజాగా
అనిల్ రావిపూడి కన్ఫార్మ్ చేశారు. జూలై 3 నుంచి షూటింగ్ ను స్టార్ట్ చేసి నవంబర్ నాటికి కంప్లీట్ చేస్తామని తెలిపారు. ఇక అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం థియేటర్స్ లో సందడి చేయడం ఖాయం.