నిర్మాత రామానాయుడిపై మోజు పడ్డ తారలు ఎవరో తెలుసా..?

lakhmi saranya
డైరెక్టర్ డి. రామానాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిర్మాతగా, డిస్ట్రబ్యూటర్ గా, స్టూడియో అధినేతగా  తెలుగు చిత్ర పరిశ్రమపై చెరగని ముద్రవేశారు డైరెక్టర్ డి. రామానాయుడు. కృషి ,పట్టుదలకి, నిరంతర శ్రమకి మారుపేరుగా విలువలతో కూడిన వ్యక్తిత్వనికి నిదర్శనంగా నిలిచారు. 13 భారతీయ భాషల్లో 150 కి పైగా సినిమాలు తీసి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలు నిర్మించిన వ్యక్తిగా 2008లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ స్థానం సంపాదించారు. 10 రూపాయల నోట్లు పై ఉన్న అన్ని భాషల్లో చిత్రాలను నిర్మించిన నిర్మాతగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.

అలాంటి రామానాయుడు తెలుగువారు కావటం మనందరికీ గర్వకారణం. ఆయన ఓ ఇంటర్వ్యూలో సరదాగా సమాధానం ఇస్తూ..ఏదో ఒక వ్యాపారం చేసి జీవితంలో నిలతొక్కుకోవాలనే ఉద్దేశంతో మద్రాస్ లో అడుగుపెట్టిన రామానాయుడు ఊహించని విధంగా నిర్మాతగా స్థిరపడ్డారు. 1964 లో సురేష్ ప్రొడక్షన్స్ ను నెలకొల్పి నటసార్వభౌముడు ఎన్టీఆర్ తో రాముడు- భీముడు తెరకెక్కించారు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తూ ముందుకు వెళ్లిన ఆయన ఒక దేశలో వరస ప్లావులతో నష్టాలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కృంగిపోకుండా  ఏఎన్ఆర్ తో భారీ బడ్జెట్ తో ప్రేమ్ నగర్ తీశారు.

నాడు తెలుగు నట భారీ వర్షాలు ముంచెత్తిన సరే జన ప్రేమ్ నగర్ చూసేందుకు థియేటర్లకు పరుగులు తీశారు. ఈ సినిమా ఘన విజయంతో ఇక రామనాయుడు వెనుదిరిగి చూసుకోలేదు. తన జీవితానికి రాముడు, భీముడు విత్తనమైతే, ప్రేమ్ నగర్ చెట్టు అంటూ ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. తన సినిమాల ద్వారా ఎందరో హీరో, హీరోయిన్లు, దర్శకులు, టెక్నిషియన్లను రామానాయుడు చిత్ర సీయకు పరిచయం చేశారు. తనను ఇంతడివాడిగా చేసిన సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేశారు, వృద్ధాశ్రమతో పాటు సినీ కార్మికుల సంక్షేమం కోసం విరాళాలు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ టికెట్ పై బాపట్ల ఎంపీగా గెలిచి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: