వాట్.. మగధీర టైటిల్ ని ఫస్ట్ ఆ మూవీకి అనుకున్నారా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

lakhmi saranya
ఒక మూవీకి అనుకున్న టైటిల్ మరో మూవీకి పెట్టడం సర్వసాధారణం. ఒక సినిమాకి అనేక టైటిల్స్ ని పరిశీలిస్తూ ఉంటారు. అందులో వారికి ఏది నచ్చితే దానిని ఫిక్స్ చేస్తారు. టాలీవుడ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటైన మగధీర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ హిస్టరీలోనే మొట్టమొదటి 5, 60,70 కోట్ల షేర్ మార్క్ అందుకున్న సినిమా ఇది. ఇటువంటి ఈ మూవీ ఎంత పవర్ ఫుల్ గా ఉందో సినిమా టైటిల్ కూడా అదే రేంజ్ లో ప్రేక్షకులను ఆకర్షించింది.

ఈ సినిమా టైటిల్ టాలీవుడ్ లో ముందు అనుకున్నా సినిమా ఏదో తెలుసా? మెగాస్టార్ చిరంజీవి ఇది వరకు మగధీరుడు సినిమా తీశారు. కానీ మగధీర అనే టైటిల్ను సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన టక్కరి దొంగ సినిమాకి అనుకున్నారట. ఆ మూవీ కోసం సుమారు 40 వరకు టైటిల్స్ ని పరిశీలన లోకి తీసుకున్నారని తెలుస్తుంది. ఇక అందులో చివరి వరకు మగధీర టైటిలే అనుకున్నారట డైరెక్టర్. కానీ చివరి సమయంలో కాకుండా టక్కరి దొంగ టైటిల్ని కన్ఫామ్ చేశారు.

ఈ మూవీ కాన్సెప్ట్ కి కూడా ఆ టైటిల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని మగధీర టైటిల్ ని పక్కకి తోసి దీనిని ఫిక్స్ చేశారట. ఇక మళ్లీ 2009లో వచ్చిన మగధీర సినిమాకి చిరు మగధీరుడు టైటిల్ కాన్సిడరేషన్ చేసిన అది మరీ చివరికి మగధీరగా ఫిక్స్ అయింది. ఇక అనంతరం మగధీర సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాయడంతో ఆ పేరుకి క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇలా చాలా సినిమాల టైటిల్స్ ముందు ఒక సినిమాకి అనుకున్న తర్వాత మరో సినిమాకి షిఫ్ట్ అయ్యాయి. ఏదేమైనాప్పటికీ ఈ సినిమా టైటిల్ ని మిస్ చేసుకుని చిరు అండ్ మహేష్ బాబు పెద్ద తప్పు చేశారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: