సినిమాల కోసం ప్రాణాలను రిస్క్ చేసిన స్టార్ హీరోలు.. తేడా వస్తే అంతే..??

Suma Kallamadi

సాధారణంగా సినిమా హీరోలకు స్టార్డమ్, బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అనేవి ఊరికే రావు. హీరో అనేవాడు చాలానే కష్టపడాలి. అతని సినిమాలు సక్సెస్ అవ్వాలి. అప్పుడే మనుగడ అనేది ఉంటుంది. ఇక తెలుగు హీరోలు మరింత కష్టపడాల్సి ఉంటుంది. తమిళంలో ఆదరిస్తారేమో కానీ తెలుగులో మాత్రం ఎంత పెద్ద స్టార్ కొడుకైనా అతడికి అర్హత లేకపోతే ఇంటికి పంపిస్తారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలు ఫ్యామిలీలను చూపి ఫాలోయింగ్ సంపాదించలేదు, చాలా కష్టపడ్డారు. 

ట్రిపుల్‌ ఆర్‌లో తారక్‌ కండలు తిరిగిన శరీరం కోసం ఎంత కష్టపడ్డాడో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే మూవీ కోసం రామ్‌చరణ్‌ కూడా రోజు జిమ్ లో కఠినమైన కసరత్తులు చేసేవాడు. రీసెంట్‌గా కల్కి సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్ కూడా అంతే కష్టపడ్డాడు ఈ మూవీలో డిఫరెంట్ సైజుల్లో కనిపించడానికి ప్రభాస్‌ అందరికంటే ఎక్కువ రిస్కు తీసుకున్నాడు. 

 బరువు పెరగడం తగ్గడం అంత సులభమైన పనేం కాదు. ఫుడ్ చేంజ్ చేస్తూ వర్కౌట్స్ కూడా మార్చేస్తూ శరీరాన్ని తీవ్ర మార్పులకు లోను చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యం పై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. ఒక్కోసారి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంటుందని ఫిట్నెస్ ట్రైనర్లు హెచ్చరిస్తుంటారు. అయినా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయాలనే ఉద్దేశంతో ప్రభాస్ రిస్క్ చేశాడు. 

ఇక యానిమల్‌ కోసం రణ్‌బీర్‌ కపూర్‌ కూడా చాలానే వర్కౌట్స్ చేశాడు. అతడి జిమ్‌ ట్రైనర్‌ యానిమల్‌కి రణ్‌బీర్‌ ప్రిపేర్‌ కావడానికి ప్రాణాలను ప్రమాదంలో పడేసాడని చెప్పాడు. సిక్స్ ప్యాక్‌ బాడీ అతడి సొంతమని కానీ 10-12 కిలోలు పెరగడం కోసం చాలా కష్టపడ్డారని అన్నాడు.

ట్రైనర్‌ శివోహం మాట్లాడుతూ రణ్‌బీర్‌ సహజంగా చాలా సన్నగా ఉంటాడు కానీ 10-12 కిలోలు పెరిగి, కాస్త బొద్దుగా కనిపించడం కోసం చాలా పెద్ద ప్రాసెస్ దాటుకొని వచ్చాడు. దీని గురించి నేను ముందుగానే హెచ్చరించా అయినా అతడు అలాగే రోజూ ట్రైనింగ్‌ మిస్‌ చేయకుండా వచ్చేవాడు అని చెప్పాడు.

అమితాబ్‌ బచ్చన్‌ లాంటి క్రమశిక్షణను రణ్‌బీర్‌లో నచ్చినట్లు ట్రైనర్ తెలిపాడు. ట్రైనింగ్‌కి ఎప్పుడూ లేటుగా వచ్చేవాడు కాదని, సినిమాలో కేరక్టర్‌కు 100% న్యాయం చేయడానికి అతడు ప్రయత్నిస్తాడని తెలిపాడు. "ఇక ఆమీర్‌ఖాన్‌ కూడా చాలా పర్ఫెక్షనిస్ట్. యాక్టింగ్ పట్ల 100% కమిట్‌మెంట్‌ చూపిస్తాడు. నటీనటులు శారీరకంగా అంతగా మారలేరు'' అని చెప్పుకొచ్చాడు. ఈ సంగతి తెలుసుకున్న చాలా మంది హీరోలు కూడా బాగానే కష్టపడుతున్నారని, వాళ్ళు సంపాదించే డబ్బులే కాకుండా వారి వెనుక ఉన్న ఈ కష్టాన్ని కూడా గుర్తించాలని కొందరు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: